డా.ఎం.మంజుశ్రీకి మొల్ల సాహిత్య పురస్కారం
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, (పటాన్ చెరువు)తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. మంజుశ్రీ గారికి గురువారం నాడు కవయిత్రి మొల్ల కళావేదిక, తాండూరు వారు మొల్ల సాహిత్య పురస్కారం-2025 తో సత్కరించారు. వీరితోపాటు ఈ సంస్థ మరో ముగ్గురికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ బివోఎస్ చైర్మెన్ ప్రొఫెసర్ ఏ విజయలక్ష్మి, పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుని డాక్టర్ జ్వలిత, ప్రభుత్వ ఉపాధ్యాయుని శ్రీమతి వాణి సక్కుబాయి లకు మొల్ల సాహిత్య పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మెన్ ప్రొఫెసర్ ఎ.విజయలక్ష్మి, గౌరవ అతిథిగా తాండూరు డి.ఎస్.పి బాలకృష్ణారెడ్డి, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కేవీఎం వెంకట ప్రజాపతి, ప్రధాన కార్యదర్శి వెంకట్ వంశ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి