"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

09 జులై, 2024

వర్షించెనొక మౌనసంగీతం! ( కవిత)

 


వర్షించెనొక మౌనసంగీతం!


మౌనానికున్న ఆ భాష నీకు తెలియాలంటే

ప్రవహించే ఆ నదిని చూడు

మౌనానికున్న ఆ భావం నీకు అర్థం కావాలంటే

కరిగి కరిగి హిమశిఖరమే 

నదిగా మారిన ఆ ప్రవాహాన్ని చూడు


పరుగుపరుగున వచ్చిన ఆ నదిని 

తనలో కలుపుకున్నంతనే 

చిన్నపిల్లాడి చేతిలో తియ్యని పదార్థమేదో ఆవిరైపోయాక

మళ్ళీశిఖరంలా మారిన ఆ హిమాలయాన్ని చూడు


నదిలో శిఖరమున్నది

శిఖరంలోనే నది కూడా ఉంది

ఈ రెండూ ఒకర్నొకరు వీడకుండానే

విడివిడిగా

ఒకరికొకరు కరిగించుకుంటూ

ఒకరికొకరు మరిగించుకొంటూ

తమలో తామే స్పటికంలా మెరుస్తుంటాయి


నదీ - హిమశిఖరమూ మాత్రమే చూసుకోగల

అద్వైత సౌందర్యచిత్రమది

నదికీ - హిమశిఖరానికీ మాత్రమే 

ఏకాంతంగా వినగలిగే మౌన సంగీతమది!

-దార్ల వెంకటేశ్వరరావు, 


కామెంట్‌లు లేవు: