"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

01 జులై, 2024

గురజాడ 'సంస్కర్త హృదయం' కథ - వస్తు, శిల్పాలు

గురజాడ సంస్కర్త హృదయం కథ - వస్తు, శిల్పాలు

-        ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,

తెలుగు శాఖ అధ్యక్షులు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్., హైదరాబాద్-500046

ఫోన్: 9989628049

                తెలుగు సాహిత్యంలో ఆధునిక భావాలనుపలికించడంలో, మూఢవిశ్వాసాలనుఖండించడంలో, సంప్రదాయభావాలపై  తిరుగుబాటు చేయడంలో, సాహిత్యంలో అనేక ప్రయోగాలు చేయడంలో, మానవత్వానికి అత్యధిక విలువనిచ్చే ప్రతిపాదనలు చేయడంలో గురజాడ వెంకట అప్పారావుగారు నేటికీ ఎంతో ముందు వరుసలో ఉన్నారు. ఆయన రాసిన కథలు కేవలం  వేళ్ళమీద లెక్కపెట్టగలిగినసంఖ్యలోనే ఉన్నాయి. అవి:1.దిద్దుబాటు, 2. మీపేరేమిటి. 3. మెటిల్డా. 4. పెద్దమసీదు (మతము-విమతము), 5. సంస్కర్త హృదయం. కానీ, వేలాది సంవత్సరాలు నిలవగలిగినకథలవి. ఆయన పనిచేసింది సంస్థానాలు, వాటి ఆధ్వర్యంలో నడిచేవిద్యాసంస్థల్లేనే అయినా, అక్కడికి వచ్చిన సామాన్యప్రజలవ్యధతో ఆయన మమేకమయ్యారు. వేశ్యావ్యవస్థ, బాల్యవివాహాలు వంటి వాటిని నిరసిస్తూ అభ్యుదయకరమైన సాహిత్యాన్ని సృష్టించారు. అప్పటికే ఆయన పాశ్చాత్య సాహిత్యాన్ని బాగా చదువుకున్నారు. ఆయనకు ఇంగ్లీష్ మీద గట్టిపట్టున్నప్పటికీ తెలుగు భాష సజీవంగా నిలబడాలంటే ప్రజల భాషలో సాహిత్యం రావాల్సిన అవసరాన్ని గుర్తించిన ఆచరణాత్మకరచయిత.

సాహిత్యం నుండి సిద్ధాంతాలు ప్రతిపాదించినంతసులువుగా అవి జీవితానికి అన్వయించినప్పుడుసరిపోతున్నాయ నిచెప్పలేమని, అందువల్ల జీవితానుభవాల నుండి సిద్ధాంతాలు రూపొందడం సరైందని భావించిన గొప్పదార్శనికుడు గురజాడ. ఆయన రాసిన ముత్యాలసరాలు, కన్యక, పూర్ణమ్మ, లవణరాజుకల వంటి గేయాలు రాయకపోయినా, ఆయన రాసిన ఈ కథలతో కూడా తెలుగు సాహిత్యంలో చిరకాలం గుర్తుండిపోయేంతటి శక్తిగల కథలు రాశారాయన. ఆయన కన్యాశుల్కం నాటకం రాయకపోయినా ఆయన రాసిన కథలు అంతప్రభావాన్ని చూపుతాయనిపిస్తుంది. కానీ, ఆయన కవిత్వంలో మానవతావాదాన్ని నిలువెత్తుస్థాయిలో నిలబెట్టినమనిషిగేయానికి ఒకసమన్వయాత్మకరూపం లవణరాజుకల. ఆయన దేశభక్తిని పునర్వచించుకోవాలని చెప్పిన గేయం దేశభక్తి. ఆయన భాష, భావం అన్నీ ప్రజల హృదయాల నుండి, ప్రజల ఆచరణల నుండి రూపుదిద్దుకున్నాయి. తాను భౌతికంగా జీవించిన కాలం చాలా తక్కువే (1961-1915), కానీ, ఆయన తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు ఆయన భావాలు శాశ్వతంగా నిలుస్తాయి. అటువంటి గొప్ప రచయిత రాసిన కథసంస్కర్త హృదయం. దీన్ని గురజాడ వారు  STOOPING TO RAISE పేరుతో ఆంగ్లంలోరాస్తే, అవసరాలసూర్యారావుగారు తెలుగులోకి అనువదించారు.ఈ కథను విశ్లేషించడమే ఈ వ్యాసంలక్ష్యం.

కథాకాలం- వస్తు చర్చ:

                సంస్కర్త హృదయం కథనుమొదట గురజాడ అప్పారావుగారు ఇంగ్లీషులో రాశారని ముందేచెప్పుకున్నాం.  దాన్ని అవసరాలసూర్యరావుగారు తెలుగులోకి అనువాదంచేసి 1951లో ప్రచురించారు. ఈ కథనుగురజాడవారుఇంగ్లీషులోనేఎందుకురాయవలసివచ్చిందనేదికూడాఒకప్రశ్నే.  గురజాడ రాసినకథలన్నిటిలోనూదిద్దుబాటు (1910) అత్యంతచిన్న కథ అయితే, సంస్కర్త హృదయం అత్యంతపెద్దకథ.ఆయనమరిన్నికథలురాసేవారేమో, కానీఆయన 1915లోనే మరణించారు. ఆయనమరణించినతర్వాత ఈ కథ తెలుగులోప్రచురణపొందింది. అంటే 1915కిముందుగానే ఈ కథ ఇంగ్లీషులోవెలువడింది. కాబట్టి ఆ కథనురాసినకాలంకూడాతెలుసుకోవాలి. అదినాకులభ్యంకాలేదు. కానీ, కథాంతర్భాగంగాఉన్నటువంటికాలంమాత్రం తెలుగు నేలఫైసంస్కరణఉద్యమాలు జరుగుతున్నటువంటి కాలమనిస్ఫష్టంగా తెలుస్తుంది. ఒకవైపు కందుకూరివీరేశలింగంగారు స్త్రీపునర్వివాహం, స్త్రీవిద్యావశ్యకత వంటిసంస్కరణలకు సంబంధించిన ఉద్యమాలువిస్తృతంగానే జరుగుతున్న కాలం.అదే కాలంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు కూడా దేవదాసి వ్యవస్థ, పడుపు వృత్తి నిర్మూలన కోసం సంస్కరణోద్యమాలు జరుపుతున్నారు.మద్రాస్ప్రెసిడెన్సీలోదేవదాసీలపేరుతో జరుగుతున్న దురాచారాలనునిషేదించాలనిశాసనసభలోకూడావిస్తృతంగానేచర్చలుజరిగుతుండేవి. 1881 నుండి 1910 వరకుఆంధ్రప్రాంతంలోజరిగిన ఆ ఉద్యమాన్ని Anti-Nautch movement గాపిలిచేవారు. కొంతమందిదేవదాసివ్యవస్థ కొనసాగాలనేవారు. మరికొంతమంది దేవదాసీవ్యవస్థపేరుతో జరుగుతున్న వ్యభిచారవృత్తిసమాజానికినష్టంకలిగిస్తుందని, అందువల్లదేవదాసీవ్యవస్థనునిర్మూలించాలనివాదించేవారు. (S. ANGALESWARI, ‘THE ANTI-NAUTCH AGITATION IN MADRAS PRESIDENCY’,Shanlax International Journal of Arts, Science and Humanities Monthly, April - 2018,Vol. 5 No.ISSN: 2321-788, page no.58-61.) ఆ కాలంలోఉన్నభిన్నసంఘర్షణలెన్నో ఈ కథలోకనిపిస్తాయి.ఈ కథలో నాయికసరళపాత్రద్వారా గురజాడ వివాహవిషయంలోప్రతిపాదించినఅంశాలపట్లవిమర్శకుల్లో (కె.వి.ఆర్సెట్టిఈశ్వరరావు) తీవ్రమైనచర్చజరిగింది.వేశ్యగా మారిన అందమైనయువతి సరళ. ఆమె కళావంతులకుటుంబానికిచెందినామె. వాళ్ళువంశపారంపర్యంగా ఆ వృత్తిలోనేకొనసాగుతున్నారు. అదివాళ్ళకి కోరుకున్నవృత్తికాదుకానీఅలవాటైపోయినవృత్తి. దానికిబాధ్యులెవరు? దాన్ని అంటే అలాంటివేశ్యావృత్తి ఎవరుచేసినా దాన్నిమాన్పాలనుకునే సంస్కర్తలూ ఉన్నారు; దాన్ని అలాగేకొనసాగించాలనే సంప్రదాయసౌందర్యవాదులూఉన్నారు. దీన్నిచెప్పడానికే  గురజాడవారు ఈ కథలో ఆ సమాజంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లువర్ణించారు. అయితే, సంస్కరణవాదుల్లో కూడా అవకాశం వస్తే తాము నిజంగాసంస్కరణనుఆచరణలోకితీసుకొనిరాగలరా? అనే ఒకలోతైనప్రశ్న ఈ కథలోకనిపిస్తుంది. అందువల్లనేసరళ దగ్గరకువెళ్ళి ఆమెవేశ్యావృత్తినిమాన్పించి,ఆమెనుసంస్కరించాలనివెళ్ళినప్రొఫెసర్రంగనాథయ్యర్పాత్రనురచయితసందిగ్ధంలోనేపెట్టారు. ఆమె ఇంటికి వెళ్ళినతర్వాతఅక్కడ ఒకఫోటో తనటేబుల్ పై పెట్టుకుంటుంది సరళ. అది తన ఫోటోయేననిగమనించి సంతోషపడిన ప్రొఫెసర్రంగనాథయ్యర్  మనసులోరేకెత్తినభావాలసంఘర్షణను రచయితఅద్భుతంగాచిత్రించారు.  ఆమెనుచూస్తుండగానే సంస్కర్త ప్రొఫెసర్గారు ఆ అందానికిముగ్దుడయ్యాడు. అదిమొదటిదశ. రెండవదశలోఆమెనుతానుఅవకాశం ఉంటేఅనుభవించడంతప్పుకాదనిరకరకాలుగాతననుతానుసమర్ధించుకున్నాడు. మూడవదశలోఆమెప్రదర్శించిన కళానైపుణ్యానికిదాసోహమైపోయేస్థితిలోకినెట్టబడ్డాడు.  ఈ దశలన్నీదాటేసమయంలోనే, ఆ ఆనందమయమైనసమయంలోనే సరళతోజరిగినసంభాషణలోతననిపెళ్ళిచేసుకొనేవాళ్ళెవరుంటారనితానెంతోనిరాశతోఅంటుంది.ఆమెనుఅనుభవించడానికిసిద్ధమైన ఆ సంస్కర్త పెళ్ళిచేసుకోవడానికిఇష్టపడలేదు. ఆపరిస్థితుల్లోవివాహంపట్లతనఅసహనాన్నిసరళవ్యక్తంచేసిందేతప్ప, తనకుపెళ్లిచేసుకోవడంఇష్టంలేదనో, రచయితవివాహవ్యవస్థనువ్యతిరేకిస్తున్నాడనోఅనుకోలేం. ఆ కథా సందర్భంలోచాలాస్పష్టంగానే అలాంటివ్యక్తినిపెళ్ళిచేసుకోవడానికిఇష్టపడేగొప్పవాళ్ళెవరు? సంస్కర్తలు... ఆ సమస్యనుఅర్థంచేసుకున్నవాళ్ళే ఆమెనువివాహంచేసుకోలేనిస్థితిలోఉంటే, ఇకసామాన్యులెవరోఎలాచేసుకుంటారని, అదిఒకజఠిలమైనసమస్యగా భావించిఆలోచించాలని, తాత్కాలికపరిష్కరణలుశాశ్వతమైనసంతోషాల్ని ఇవ్వలేవనేది రచయితతీర్పుఈకథలోఎవరైనాముందుగా తమను తాముసంస్కరించుకోగలగాలి. అప్పుడుఇతరులనసంస్కరించాలనిప్రయత్నించాలి. అలాకానిసంస్కర్తలహృదయాలనుఆవిష్కరింపజేసిన కథ ఇది.  దీనిపైఆంగ్లప్రభావంఉందనికొంతమందివిమర్శకులుపేర్కొన్నారు. ఈ కథలోని వస్తువు ఆనాటి సమాజంలో కొనసాగుతున్నవేశ్యావ్యవస్థ, దానిలోకూరుకుపోయిప్రత్యామ్నాయం లేకపోవడంతోసరైనజీవితం దొరికితే దానినుండి బయటపడాలనుకునే వేశ్యలహృదయాలను రచయితఎంతోశక్తివంతంగా  ఆవిష్కరించారు. ఇదంతాఒకనాటకంలాఅనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో వేశ్యావృత్తిని మాన్పాలనిప్రయత్నించేవారి అంతరంగాన్నికూడా మున్ముందు ఉంచడం కోసం కథలో అనేకచర్చనీయాంశాలను పెట్టారు.  

శిల్పంరీత్యా ఈ కథలోసర్వసాక్షికథనాన్నేప్రధానంగారచయితఅనుసరించినా, కథనునడిపించడంలో నాటకీయశిల్పాన్నిఉపయోగించుకున్నారని ఈ కథనుఇంతకుముందేవిశ్లేషించినవారువివరించారు. నాటకీయశిల్పాన్ని  సాధారణంగామహాభారతాన్ని రచించినతిక్కనరచనాశైలిలోనాటకశిల్పంగురించేగుర్తుకువస్తుంది. కానీనాటకీయతలోఅభినయానుగుణసంభాషణలుమాత్రమేకాదు. అంతర్నాటకంకూడానాటకీయశిల్పంలోఅంతర్భాగమే. దీన్నేగురుజాడవారు ఈ కథలోపెట్టారు.

కథలోసంస్కర్త  ప్రొఫెసర్రంగనాథయ్యర్సమాజంలోపేరుప్రతిష్టలకోసంఒకసంస్కర్తగానటించాడు. కథానాయకి సరళతననీ పెళ్ళి చేసుకోమంటేచేసుకుంటాననే ధైర్యాన్నిప్రదర్శించలేకపోయాడనేది నటనేననినిరూపించే ఒకచక్కనిసన్నివేశమేదీనికిఅంతర్గతసాక్ష్యం. తానుసంస్కరించాలనుకున్నసరళలోనిఅందం, ఆమెకళాప్రదర్శనాతనకుప్రత్యక్షంగాఅనుభవంలోకివచ్చేసరికిప్రొఫెసర్రంగనాథయ్యర్తననుతానునియంత్రించుకోలేకపోయాడు. ఆ విధంగాకూడాఅతనిజీవితంఒకనటనగానేబయటపడుతుంది. చందర్ అనే విద్యార్థితానుసరళనుతనప్రయోగానికిశక్తివంచనలేకుండాఉపయోగించుకున్నాడు. అందువల్లనేఆమెకావాలనేదేవాలయానికివెళ్ళింది. అలావెళ్ళడంకూడాఒకనటనేనేమో.

చందర్తనప్రయోగాలకుకళాశాలలోనిలాబ్ఉపయోగించుకోవడానికిఏర్పాట్లుచేసుకున్నట్లుఅందరినీనమ్మించాడు. కానీ, అక్కడకాకుండాసరళఇంటినేరంగస్ధలంగాఉపయోగించుకున్నాడు. ప్రొఫెసర్రంగనాథయ్యర్స్వయంగాసరళఇంటికివెళ్ళేలాచేశాడు. ఆ నాటకాన్నిచూపించడానికేసరళఇంటిదగ్గర కొంతమందిని పెట్టాడు. ప్రొఫెసర్రంగనాథయ్యర్సరళసౌందర్యానికీ, ఆమెకళాప్రదర్శనకీతనయుడైనవెంటనేఆమెఇంటిదగ్గర ఆ నాటకంవిజయవంతమైనందుకుఈలలు, కేకలువేశారు.  కథనుముగించడంలో ఈ శిల్పరహస్యంమరింతబిగువునితీసుకొచ్చింది.

ఆధునికతలక్షణాలతోసమన్వయం:

                గురజాడ కథలలోనిప్రత్యేకతనుకొడవటిగంటికుటుంబరావుగారుచెప్తూ ఆధునిక యుగలక్షణాలనుకొన్నింటినిప్రత్యేకంగాప్రస్తావించారు.  (గురజాడ కథలు- వాటిప్రత్యేకత (వ్యాసం),  ఒకటిన్నరశతాబ్దాల గురజాడ. మహాకవి గురజాడ అప్పారావు 150వ జయంత్త్యుత్సవవిశిష్ట సంచిక-2012, విజయనగరం. పుటః 66-70)            

1.సమకాలీన జీవితాన్నికథలలోస్పష్టంగాచిత్రించటం. గురజాడ కాలంలోజరుగుతున్నాయాంటీనాచ్ఉద్యమాన్నితన కథ సంస్కర్త హృదయములోనూ, అంతకుముందేరాసినకన్యాశుల్కంనాటకంలోనూపెట్టారు. సమకాలీనతనుఆశ్రయించుకున్నదేవాస్తవికతఅయినప్పటికీఅప్పారావుగారికథలలోవాస్తవికతనూటికినూరుపాళ్ళుమనకుకనిపిస్తుంది.

2. ఆధునిక కథలలోస్పష్టమైనధార్మికదృష్టీ, నైతికదృష్టీమాత్రమేకాకుండా సామాజిక దృష్టికలిగిఉంటాయి. అప్పారావుగారుతనకథలలోమతముయాంటీనాట్స్ అనే సమస్యలుప్రధానంగాతీసుకున్నారనికొడవటిగంటిఅన్నారు. దీన్ని మనం సంస్కర్త హృదయం కథలోపరిశీలిస్తేవేదాలలోఉన్నవిషయాలనుతర్వాతదేవస్థానంలోబోర్డుసభ్యులమధ్యవాహనోత్సవాదాలనుప్రస్తావించటంలో గురజాడ గారి ఈ ఆధునిక లక్షణంకనిపిస్తుంది.

మంజువాణి- సరళ- మధురవాణి:

                గురజాడ తనరచనల్లోవేశ్యవృత్తినిప్రస్తావించడం, ఆ సందర్భంగా కొన్నిపాత్రలనుసృష్టించడం, ఆ పాత్రలు ఒక్కొక్క రచనలువివిధపరిణామాలకుగురికావడం మనం గమనించవలసినఒకప్రత్యేకఅంశం. కొండుబట్టీయంలోమంజువాణి, కన్యాశుల్కంలోమధురవాణిగాపరిణామంచెందిందనిఆరుద్రమరికొంతమందిపరిశోధకులువివిధసందర్భాలలోప్రస్తావించారు. సరళపాత్రలోనిమేధస్సునుతీసుకొచ్చిరెండవకన్యాశుల్కంమధురవాణిలోకలిపారని, రంగనాథయ్యరేసౌజన్య రావు అని ఆరుద్రతన గురజాడ గురుపీఠం (పుటలు: 15,17)లోవివరించారు.

సంస్కర్త హృదయంలోసరళ, ప్రొఫెసర్రంగనాథయ్యర్తో‘‘నాబోటిబోగంపిల్లను మర్యాదస్థుడుపెళ్లాడతాడోచెప్పండిమీరే’’అంటుంది. కన్యాశుల్కంనాటకంలోమధురవాణి ఈ మాటనిచాలాజాగ్రత్తగాపెళ్లిచేసుకోగోరినవేశ్యలకుకోరదగినవరులుదొరకడంఎలాగండి?లేకయెట్టివారైనాసరే అని తమఅభిప్రాయమాఅండి? అని అడుగుతుందిసౌజన్య రావు పంతుల్ని. అప్పుడుసౌజన్య రావు పంతులు ఈ సంగతిఇంకాతానుబాగాఆలోచించలేదనీ, వేశ్యలువిద్యలునేర్చినయితరవృత్తులవల్లసత్కాలక్షేపంచెయ్యమనితనసలహాగా చెప్తాడు. ఈ పరిణామాల్లోసరళపాత్రనుగమనిస్తేకొండుబట్టీయంలోనిమంజువాణిపాత్రలోఉన్నకొన్నిలక్షణాలుసరళపాత్రలోకనిపిస్తాయి. అలావేశ్యావృత్తిమానేస్తేతమలాంటివాళ్ళుపెళ్ళిచేసుకుంటారా? అని అడుగుతుందిమధురవాణి. కానీ, సౌజన్య రావు పంతులుతానెప్పుడూవేశ్యనుపెళ్ళాడినంటాడు. ఈ రెండు రచనల్లోనూసంస్కరణోద్యమాలఆచరణనుప్రశ్నిస్తూ, ఆ పరిష్కారాల్నికూడాచూపినప్పుడేసంస్కరణోద్యమాలవల్లప్రయోజనంఉంటుందనీ, లేకపోతేఅవికేవలంకొంతమందిసానుభూతిఉద్యమాలుగానేమిగిలిపోతాయనేభావనకనిపిస్తుంది.

సంస్కర్తహృదయంలోమరికొన్ని చర్చనీయాంశాలు:

ఈ కథలోఒకఅందమైనభోగంపిల్లసరళప్రజల్నిఎలాఆకర్షించుకుంటుందో, ఆమెకుఎలాఆకర్షింపబడుతున్నారోతెలుసుకోవాలని ఒకవైపు చందన్ ఆ కళాశాలలోనేప్రయోగాలుచేస్తుంటాడనిరచయితవర్ణించారు.దీన్నిఒకాయన'మానవపరిణామశాస్త్రపరిశోధనకైప్రయోగాలుచేయడం( అందులోనూఒకవిద్యాసంస్థలేబ్లో ) చాలాఎబ్బెట్టుగాఉంది. దీనినిపాఠకులుఏవిధంగాగురజాడనుసమర్ధిస్తారోనాకైతేఅంతుబట్టలేదని (శివ్వాంప్రభాకరం, మొలక, అంతర్జాల పత్రిక, 20 ఆగస్టు 2020) అభిప్రాయపడ్డారు. ఆ వ్యాసం online లోఅసంపూర్తిగానేలభిస్తుంది. తర్వాతఏమివ్యాఖ్యానించారోతెలియదు.కానీ, గురజాడ వారి కథా శిల్పాన్నిఆవ్యాసకర్తశివ్వాంప్రభాకరంమరింతలోతుగాఆలోచిస్తే బాగుండేది. కథలోరచయితరంగనాథయ్యర్చెబుతున్నస్కరణోద్యమాన్ని ఆ కళాశాలవిద్యార్థివ్యతిరేకించడంల్యాబ్లోనేఅటువంటివ్యవహారాలు (ప్రయోగాలు) చేస్తున్నాడనేరచయితకథనాన్నిఅవగాహనచేసుకోవాలంటేకళాశాల / విద్యాసంస్థల్లో  జరుగుతున్న అనేకవిషయాల్నిజాగ్రత్తగాపరిశీలించాలి. కొన్నివిషయాలుతెలిసినవిద్యార్థులుగాని,అధ్యాపకులుగాని,ఇతరులుగానితెలిసీతెలియనట్లుగావ్యవహరిస్తుంటారు. విద్యాసంస్థలలో ఈ మధ్యకాలంలోతరగతిగదిలోకివచ్చిలక్ష్మీ అనే ఒకఅమ్మాయినినరికేసినసంఘటనమనందరికీతెలుసు. అదిఎంతోసంచలనంకూడాసృష్టించింది. కానీ, దాన్నికొన్నిసంవత్సరాలుతర్వాతఒకరచయితరాస్తే ఈ సమాజంఅంతఅనాగరికంగాఉందాఅనుకునేఅవకాశంకూడాఉంది. పోనీ ఆ కత్తితోనరికేసిన ఆ విద్యార్థికిశిక్షపడిందాఅంటేపడలేదనేదికూడామనల్నివిస్మయంకలిగించేఅంశం. ఇవన్నీనమ్మశక్యంకానినిజాలు. గురజాడ వారు చిత్రించినతరగతిగదిలోసరళపైప్రయోగాల్నికేవలంవాచ్యంగాతీసుకోవడానికివీల్లేదు. దీన్నికథానికా సాహిత్యంలో Suggestive Meaning అంటారు.తాను చెప్పవలసిన విషయాన్ని కథారచయిత చెప్పడానికి ఒక వాతావరణాన్ని సృష్టించి, దాని ద్వారా తన లక్ష్యాన్ని పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తాడు. అదే ఇక్కడ తరగతి గదిలో సరళపై జరిగిన ప్రయోగంగా అవగాహన చేసుకోవాలి.

కొండుబొట్టీయంలోనిమంజువాణి, స్టూపింగ్టురెయిజ్ఆంగ్లకథానాయకిసరళలనుపరిశీలించిమంజువాణిపాత్రనేతీసుకునిసరళలోనితెలివినికలిపిరెండవమధురవాణిని గురజాడ సృష్టించారనిఆరుద్ర గురజాడ గురుపీఠం (పుట:13)లోపేర్కొన్నారు.మధురవాణిపాత్రపరిణామాన్నిచూస్తేఒకతెలివైనపాత్రగాకనిపిస్తుంది. కనుక, సరళపాత్రనుసమాజంలోమహిళలకువస్తున్నతెలివితేటలకుఒకపరిణామపాత్రగాచిత్రించాలనుకున్నారు గురజాడ. సంస్కరణఅనేదికొంతమందివ్యక్తులతోజరిగేదికాదు. ముందుగా ఆ సమాజంలోచైతన్యరావాలి. తమనిసంస్కరించాలనుకునేవారుకూడా ఆ సంస్కరణవాదులకుసహకరించకపోగా, ఉన్న ఆ జీవితమేబాగుందనిభావించేవాళ్ళుకూడాఉంటారు. అదిచెప్పడానికే ఆ ప్లీడర్లుతమతరపునవాదిస్తేతమఅందాన్నిసంతోషంగావాళ్ళకిసమర్పించుకునేవారనికథలోచెప్పారురచయిత. కానీ, కథంతారంగనాథయ్యర్గారిచుట్టూతిప్పిఒకకుహనాసంస్కరణవాదిగాఆయననునిరూపించడంకోసమే ఈ కథ రాశారాఅనేదికూడా మనం ఆలోచించాలి. ఈ కథలోరచయితసమాజమంతటాపడుపువృత్తినిర్మూలింపబడాలనేఉద్రేకభావం M అనే పట్టణాన్నికెరటంలాముంచెత్తిందన్నారు. P అనే పట్టణంలోసంఘసంస్కారాలు సభ జరుపుతున్నారనికొన్నిసంకేతాలనుకథలోరచయితప్రయోగించారు. ఇలాకొన్నిసంకేతాలతోకథనుచెప్పడంవెనకకూడాఒకపరమార్ధంఏదోఉంటుంది.  దాన్నికూడాలోతుగాపరిశీలించాల్సినఅవసరంఉంది. Mass hysteria పట్టినపట్టణంఅనుకోవాల్సిఉంటుందా? అలాగే P అనేదిప్రోగ్రెస్ఐడియాలజీఉన్నపట్టణాన్నిపరోక్షంగా ఈ సంకేతాలద్వారారచయితసూచిస్తున్నారాఅనేదికూడాఅనుమానించాల్సివస్తుంది. ఏదైనా ఒక సామాజిక రుగ్మతగురించిసంఖ్యాపరంగాఅత్యధికులుచర్చోపచర్చలుచేసినప్పటికీ, అభ్యుదయవాదులులేదాశాస్త్రీయపద్ధతులతోదానిపరిష్కారాన్నిసూచించాలనుకున్నప్పటికీదానికిమద్దతుతక్కువగానేఉంటుంది. ఇదంతా ఈ వ్యాసకర్తఊహమాత్రమే. దీన్నినిరూపించాలంటే నేను చాలా పరిశోధన చేయాల్సివస్తుంది. అందువల్ల ఈ కోణాన్నిఇక్కడితోఆపేసిమిగతాఅంశాల్నిపరిశీలించేప్రయత్నంచేస్తాను. కథా రచయితప్రొఫెసర్నిపరిచయంచేస్తూఇలాఅన్నారు. ‘’ఆ ఊరికాలేజీలోరంగనాథయ్యరుప్రొఫెసర్గాపనిచేస్తున్నారు. మంచిసంస్కారి, ఉన్నతభావోద్రికి. సంఘసంస్కరణోత్సాహి’’

ఈ మాటలనుబట్టిఆయనఆలోచనలుగొప్పవేగానిఆయనఉద్రేకస్వభావంగలవాడనికూడాస్పష్టంగాతెలుస్తుంది. దీనిపరిణామాలనుతర్వాతమరికొన్నిచోట్లరంగనాథఅయ్యరుగుణశీలాన్నివివరించేసందర్భంలోనేరేటర్ మనకి మరింతవివరించాడు.

రంగనాథయ్యరుగ్రీకులవంటిసౌందర్యారాధకుడు. ప్రతీరోజుస్వర్ణలేఖనదీతీరానషికారుతిరిగేవాడు.’’

                నిజమైనసౌందర్యారాధకునికినైతికవిలువలతోపనిఉండదనేఒకవాదనసౌందర్యవాదులలోఉంది. తానువిద్యార్థిగాచదువుకుంటున్నప్పుడుతనపాఠంతప్పమరొకధ్యాసలేదు. ప్రకృతిసౌందర్యానికిముగ్దుడయ్యేమనసుఉన్నా, దాన్నితనుచదువుకున్నసైన్స్అణచివేసేది. కానీతనకుమంచిపేరుప్రఖ్యాతలుకావాలనేఆకాంక్షఉండేది. ఆ విషయాన్ని కథ చెబుతున్ననెరేటర్రంగనాథయ్యరుగారిగురించివ్యాఖ్యానించడంవల్లతెలుస్తుంది. 

                ఈ పాత్రనుమనోవైజ్ఞానికదృష్టితోకూడాపరిశీలించాల్సినఅవసరంఉంది. రంగనాథయ్యరుతానుచదువుకునేటప్పుడుప్రకృతినీ, ఆ సౌందర్యాన్నితనకుఆస్వాదించాలనిఉండేది. కానీఅతనుఆస్వాదించలేకపోయాడు. తనభార్యకూడాతానుఆశించినసౌందర్యాస్వాదనకలిగినవ్యక్తికాదు. ఇవన్నీఅతనిమనసులోగుప్తంగాఉండిపోయాయి. మరలాసౌందర్యాస్వాదనకుఅవకాశంవచ్చినప్పుడు, తననెవరూగమనించడంలేదనిఅనిపించినప్పుడుదాన్నితీర్చుకోవాలనుకున్నాడు. ఒక్కసారిగాతానుఇంట్లోఉండగాబయటజనందొంగదొంగఅని వచ్చేసరికి ఆ విషయంమరలాబయటప్రపంచానికితెలియడంఇష్టంలేకతానురాజీనామాచేసివెళ్లిపోయాడు. బలహీనమైనకోర్కెలుబలమైనఆశయాల్నినాశనంచేస్తాయి. ఇక్కడ కథా రచయితఒక్కస్త్రీబలహీనతనుమాత్రమేచూపించారు. దీనితోపాటుకుటుంబం, డబ్బు, అధికారంవంటిబలహీనతలుకూడాఉన్నతమైనఆశయాలనునెరవేర్చడానికిఆటంకాలుగామారొచ్చు.మానసికబలహీనత కంటే మేధోపరమైనబలంచాలాఅవసరం. సంఘసంస్కరణ అనేదిఒకవ్యక్తికిసంబంధించినదేకాకపోవచ్చు. కానీ, ఒకవ్యక్తికూడామార్చగలిగేమనోసంకల్పంకూడాఉండాలి.

                సామాన్యుల కంటే అసామాన్యమైనఆలోచనలుఉన్నవ్యక్తిప్రొఫెసర్రంగనాథయ్యార్. మరిఅలాంటివిలువలకుకట్టుబడినటువంటివ్యక్తిచిన్నబలహీనతకూడాలోనుకాకూడదు. మనఆశయంఎంతగొప్పదైనాఒకచిన్నలోపం, చిన్నబలహీనతఉన్నాకూడాఅంతగొప్పఆశయాన్నినాశనంచేస్తుందిఅనేదిప్రొఫెసర్రంగనాథయ్యర్గారిపాత్రలోనిరూపించారు. సంస్కరణాభిలాషఅనేదికేవలంమేధావులలోవచ్చినంతమాత్రానసరిపోదు. అదిప్రజలందరూఅవగాహనచేసుకునేలాదాన్నిప్రజలదగ్గరికితీసుకువెళ్ళగలగాలి. అలాజరగనంతకాలంభూస్వాములు, అధికారంలోఉన్నవాళ్లు, వాళ్ళవారసులుసమాజంలోఎటువంటిసంస్కరణనుకూడాజరగనివ్వకుండగాఅడ్డుకోవడానికిఎన్నోకుట్రలు, కుతంత్రాలుపన్నుతారని జిల్లా మునసబు, ప్లీడర్లు, చందర్మొదలైనపాత్రలన్నీనిదర్శనంగానిలుస్తున్నాయి. సంస్కర్త హృదయంకథలోపడుకోవృత్తిఅనేదికేవలం సామాజిక సమస్యమాత్రమేకాదు, ఆర్థిక సమస్యకూడాఅనేదిచర్చించేలాచేశారు. కథ ఎలాఉన్నాకొన్ని సామాజిక రుగ్మతలకుసంబంధించినవిషయాలుప్రభుత్వంగానీప్రజలుగానీసంఘటితంగాపనిచేయకపోతేవాటినినిర్మూలించటంఅంతసులభమైనపనికాదు. అందువల్లనేబ్రిటిష్కాలంనుండినేటివరకుపడుపువృత్తికిసంబంధించినచట్టాలుఎన్నివస్తున్నా, వాటి వల్లనే అవిపూర్తిగానిర్మూలించేప్రయత్నాలుజరుగుతున్నాఅవినూటికినూరుశాతంసత్ఫలితాలలనుఇవ్వలేకపోతున్నాయి. కాకపోతేబహిరంగంగాచేయలేకపోవచ్చు. కానీపరోక్షంగాఅవికొనసాగుతూఉంటాయి. ఇటువంటివన్నీ సామాజిక సమస్యలేఅయినప్పటికీ ఆర్థిక విషయాలతోమిళితమైఉన్నసమస్యలు. అలాగనికేవలంఆర్థికపరమైనవిషయాలతోనేముడిపడిఉన్నాయాఅనుకుంటేకొన్నిఇతరఅంశాలతోకూడాఅంశాలుముడిపడిఉంటాయి. వీటన్నింటినీమనకుచర్చనీయాంశంచేసిన కథ సంస్కర్త హృదయం.

 

 

 

 

 


కామెంట్‌లు లేవు: