శ్రీ రామోజీరావుగారి మరణం
తెలుగు పత్రికా రంగానికి తీరనిలోటు
ఈనాడు గ్రూపు వ్యవస్థాపకులు రామోజీరావు గారు తెలుగు పత్రికారంగంలో ఒక చిరస్మరణీయమైన మార్పుకి శ్రీకారం చుట్టిన వారు. ఆ పత్రిక సంపాదకీయ పుటల్లో నేను కూడా కొన్ని వ్యాసాలు రాశాను. ప్రతి అక్షరం పట్ల ఎంతో శ్రద్ధ వహించేవారు. ఆయన మరణం తెలుగు పత్రికా రంగానికి తీరనిలోటు
రామోజీరావు గారు నడిపిన పత్రికలలో అక్షర దోషాలను సాధ్యమైనంత వరకు తగ్గడమే కాకుండా, ప్రామాణికమైన భాషను వినియోగించేలా చేశారు. ఆ విధంగా భాషకు ఒక ప్రామాణిక రూపాన్ని అందించారు. ఈనాడు జర్నలిజం ద్వారా ప్రచురించిన కొన్ని పుస్తకాలు విశ్వవిద్యాలయాల స్థాయిలో కూడా రెఫరెన్స్ గా ఉపయోగపడేవి.
రామోజీరావు గారి ఆలోచనలో రూపుదిద్దుకున్న అన్నదాత వ్యవసాయ రంగానికి సంబంధించిన గొప్ప పత్రిక. 'తెలుగు వెలుగు' సాహితీ రంగంలో ఒక సంచలనం. 'విపుల', 'చతుర' పత్రికలు దేశ దేశాల సాహిత్యాన్ని అనుసంధానం చేశాయి. గొప్పదార్శనికుడైన రామోజీరావుగారి మరణం (8.6.2024) తెలుగు పాత్రికేయ రంగానికి తీరని లోటు.
రామోజీరావు గారి కృషి జర్నలిజానికి స్వర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక అధ్యాయం. ఆయన మరణం తెలుగు భాషకు, తెలుగు జర్నలిజానికి తీరని లోటు. వారి మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి