ఆచార్య ‘దార్ల’ఆలోచనలు విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు
తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక, 10.6.2024 సౌజన్యంతో
ఈనాడు దినపత్రిక, 10.6.2024 సౌజన్యంతో
తెలుగులోకం దినపత్రిక, 10.6.2024 సౌజన్యంతో
భూమి పుత్ర దినపత్రిక, 10.6.2024 సౌజన్యంతో
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న బహుజన విద్యార్థి ఫ్రెంట్ నాయకులు
హెచ్ సియు తెలుగు శాఖకు అధ్యక్షులుగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నాడు (9.6.2024) హెచ్.సి.యు.లోని బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ విద్యార్థి సంఘం తరపున ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సేవలను కొనియాడి ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బిఎస్ఎఫ్ అధ్యక్షులు అంజి ఎర్రోళ్ల మాట్లాడుతూ తన మూడేళ్ల కాలంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేసిన సేవలు విద్యార్థుల మేలు కోరే విధంగాను, విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొనేవిధంగాను ఉన్నాయని పేర్కొన్నారు.
ఎం.ఏ., విద్యార్థులకు ముఖ్యంగా పరిశోధనకు సంబంధించిన కోర్సును నూతన జాతీయ విద్యావిధానం -2020 కంటే ముందే ప్రారంభించి స్నాతకోత్తర స్థాయిలోనే పరిశోధన వైపు అడుగులు వేసే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఆచార్య దార్ల గారి ముందుచూపు ఆదర్శనీయమని బిఎస్ ఎఫ్ ఉపాధ్యక్షులు దివాకర్, త్రివేణి వ్యాఖ్యానించారు. తనకు జరిగిన సత్కారానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలుపుతూ హెచ్ సియులో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడానికి ఎంతో స్వేచ్ఛ ఉంటుందనీ, అది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలన్నారు. సామాజికంగా అనేక సమస్యల్ని దగ్గరగా చూసిన అనుభవంతో విద్యార్థులకు ఉపయోగపడే కొత్త కోర్సుల రూపకల్పన చేస్తే, డిపార్ట్మెంట్, యూనివర్సిటీ సహకరించిందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ ప్రెసిడెంట్ అంజి ఎర్రోళ్ల. వైస్ ప్రెసిడెంట్ దివాకర్, త్రివేణి. ఈ కార్యక్రమంలో బిఎస్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి విమల, స్పోక్స్ పర్సన్ ప్రసన్న, జాయింట్ సెక్రటరీ పావని, మల్లేష్, అనిల్, అతుల్. ఆర్గనైజింగ్ సెక్రెటరీ అజయ్, సందీప్. కోశాధికారులు నవీన్, పవన్, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
దిశ దినపత్రిక, 11.6.2024 సౌజన్యంతో
సాక్షి దినపత్రిక, 11.6.2024 సౌజన్యంతో
ఆంధ్ర ప్రభ దినపత్రిక, 11.6.2024 సౌజన్యంతో
విశాలభారతి దినపత్రిక, 11.6.2024 సౌజన్యంతో నమస్తే తెలంగాణ దినపత్రిక, 11.6.2024 సౌజన్యంతో
నవతెలంగాణ దినపత్రిక, 11.6.2024 సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి