"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

01 జూన్, 2024

శాఖాధ్యక్షులుగా ఆచార్య దార్ల పదవీ విరమణ, అభినందన సభ (31.5.2024)

జనప్రతిధ్వని దినపత్రిక, 1.6.2024 సౌజన్యంతో

తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక, 1.6.2024 సౌజన్యంతో

భూమిపుత్ర దినపత్రిక, 1.6.2024 సౌజన్యంతో

విశాలభారతి దినపత్రిక, 1.6.2024 సౌజన్యంతో

నమస్తేతెలంగాణ దినపత్రిక, 1.6.2024 సౌజన్యంతో

దిశ దినపత్రిక, 1.6.2024 సౌజన్యంతో

తెలుగులోకం దినపత్రిక, 1.6.2024 సౌజన్యంతో

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 1.6.2024 సౌజన్యంతో

నవతెలంగాణ దినపత్రిక, 1.6.2024 సౌజన్యంతో

సాక్షి దినపత్రిక, 1.6.2024 సౌజన్యంతో

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్, ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు, తెలుగు అధ్యాపకులు

 స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్, ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు ని సత్కరిస్తున్న తెలుగు అధ్యాపకులు

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్, ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు, తెలుగు అధ్యాపకులు

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్, ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు, తెలుగు అధ్యాపకులు

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్, ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు, తెలుగు అధ్యాపకులు
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్, ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు, తెలుగు అధ్యాపకులు
ఆచార్య  పిల్లలమర్రి రాములుగార్ని సత్కరిస్తున్న తెలుగు అధ్యాపకులు
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్, ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు, తెలుగు అధ్యాపకులు
ఆచార్య పిల్లలమర్రి రాములుగార్కి నూతన శాఖాధ్యక్షులుగా నియామకపత్రాన్ని అందజేస్తున్న ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యాపకలు

ఆచార్య దార్ల సేవలు శ్లాఘనీయం

గత మూడేళ్ల కాలంలో తెలుగు శాఖ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని శాఖాధ్యక్షులుగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చేసిన సేవలు ప్రసంశనీయమని పలువురు అధ్యాపకులు పేర్కొన్నారు. హెచ్ సి యు తెలుగు శాఖ అధ్యక్షులుగా శుక్రవారంతో తన పదవీకాలం పూర్తయిన సందర్భంగా అధ్యాపకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఒక వైపు శాఖాధ్యక్షులుగా తన విధులను నిర్వర్తిస్తూనే, మరొకవైపు పాఠాలు చెప్తూ, పరిశోధన చేయిస్తూ, వ్యక్తిగతంగా తాను రచనా వ్యాసంగాన్ని, సాహిత్య కార్యక్రమాల్ని కొనసాగించిన కార్యదక్షులుగా ఆచార్య దార్ల ను సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య గోనానాయక్ వ్యాఖ్యానించారు. తెలుగు శాఖతో తనకు మూడు దశాబ్దాల పాటు అనుబంధం ఉందనీ, ఆచార్యులు కొత్తపల్లి వీరభద్రరావు, జి.వి.సుబ్రహ్మణ్యం, ముదిగొండ వీరభద్రయ్య, బేతవోలు రామబ్రహ్మం వంటి గొప్పవాళ్ళు శాఖాధ్యక్షులుగా పనిచేసిన వరుసలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పని చేసి, చక్కని సమర్థుడని పేరుతెచ్చుకున్నారని సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మానవీయ శాస్త్రాల విభాగం పీఠాధిపతి ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు వ్యాఖ్యానించారు. 

కరోనా సమయంలో శాఖాధ్యక్షులుగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. తన కాలంలో ఐదుగురు నూతన అధ్యాపకుల నియామకం జరిగింది. ఆన్లైన్ నుండి ఆఫ్లైన్ తరగతులు జరుపుకొనే సంధికాలంలో అధ్యక్షులుగా ఆచార్య దార్ల చక్కని సమన్వయంతో పనిచేశారని అధ్యాపకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య దార్లను ఘనంగా సత్కరించారు. శనివారం నుండి నూతన శాఖాధ్యక్షులుగా కొనసాగబోయే ఆచార్య పిల్లలమర్రి రాములుకి ఆచార్య జంధ్యాల ప్రభాకరరావు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు శాఖాధ్యక్షుల నియామక పత్రాన్ని అందించారు. తన విధులనేవి ఉద్యోగంలో భాగమేననీ, ఆ పదవిలో ఉన్న వారెవరైనా అందరి సహకారం వల్లనే శాఖను అభివృద్ధిపథంలో నడిపించడం సాధ్యమౌతుందని, తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆచార్య డి.విజయలక్ష్మి, ఆచార్య వంగరి త్రివేణి, డా.బి.తిరుపతి, డా.బి.భుజంగరెడ్డి, డా.పి.విజయ్ కుమార్, డా.బి.లత, స్వాతి, దయాకర్, విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు: