ఎస్సీ వర్గీకరణ పై సుమారు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న ఉద్యమం. అది సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, ఏడుగురు న్యాయమూర్తులతో ఒక ధర్మాసనం ఏర్పడి వాదోపవాదాలు జరగడం ఒక చారిత్రక పరిణామ క్రమం. ఈ తీర్పు చరిత్రలో సామాజిక అధ్యయనాలలో సాహిత్య సృజనలు విప్లవాత్మమైన మార్పులను తీసుకొస్తుంది. ఈ నమ్మకంతోనే దీనికి సంబంధించిన నాకు అందుబాటులోకి వచ్చిన కొన్నింటిని ఇక్కడ వారి వారి సౌజన్యంతో నాకు అందుబాటులోకి వచ్చిన వాటిని పునర్ముద్రి స్తున్నాను... దార్ల.
....
"ప్రశ్నల దండు"
వర్గీకరణ మీద అనుకూలంగా వాదనలు చేసిన వారిలో ఎక్కువగా ప్రస్తావించిన ఆర్టికల్స్ 15 (4) 16 (4) 341 332 335 338 ఇలాక్ చేస్తూ వచ్చారు.
ఎమ్మార్పీఎస్ తరపున వాదించిన కేకే వేణుగోపాల్ గారు 14 & 38 ఆర్టికల్స్ మీద వాదించారు.
కానీ అందరూ ఒక విషయాన్ని బాగా ప్రస్తావించారు. సుప్రీం కోర్ట్ లో వేరు వేరు కేసుల్లో కూడా ఈవీ చెన్నయ్య కేసు జడ్జ్స్మెంట్ లో లోపాలు పలు మార్లు ప్రస్తావన కి వచ్చిన విషయం చెప్పారు.
శంకర్ నారాయణ అనే లాయర్ వాదనల్లో రాష్ట్రాలే వర్గీకరణ చేసుకోవచ్చు, ఆర్టికల్ 15 (4) & 16 (4) ప్రకారం అని. ఆయన ప్రస్తావించిన 1881 అండ్ 1935 కులాల జాబితా అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
కొందరు కేవలం 16 (4) గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఒక కులాన్ని ఎస్సీ జాబితాలో తొలగించడం, ఉంచడం రాష్ట్రపతి లేదా పార్లమెంట్ పరిధిలో ఉంది. కానీ రాష్ట్రాల్లో ఉన్న వాటిని ఆ రాష్ట్రం లోని జాబితా కులాలకు ఎలా పంచాలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనేది వాదన.
సీనియర్ అద్వకేట్ కపిల్ సిబల్ అయితే దళితులంతా ఏకజాతీయులు కాదు, బహుజాతీయులు అనే అంశాన్ని "గురు తేజ్ బహదూర్" దగ్గర నుండి ఆధారం చెప్పిన విధానం జడ్జీలను సైతం కన్విన్స్ చేసింది.
ఇన్నాళ్లు చెన్నయ్య కేసు లో "ఏక జాతీయత" అనే అంశాన్ని అడ్డుపెట్టి వర్గీకరణ కొట్టేసిన తీర్పులకు, ఈ ప్రశ్నలన్నీ చెంపపెట్టే.
సుప్రీం కోర్ట్ ఏడుగురు సభ్యుల ధర్మాసనం దళితులంతా ఏకజాతీయులు కాదు అని నమ్ముతుంది. కేసులో వాదనలు ముగిశాయి.
తీర్పు రిజర్వ్ చేశారు. సానుకూల తీర్పు వస్తుందని నమ్ముతున్నాను.
పచ్చల రాజేష్.
వాట్సాప్, 9.2.2024
.....
08-02-2024:- ABCD Legal Fight Update Report No-10:- (1) 3rd Day in Supreme Court లో Sub-Categorisation of SC Community కి సంభందించిన CA No 2317/2011 between Punjab Govt. vs Davinder Singh &others case లొ ( ఇది AP వాళ్ళు వేసింది కాదు) Punjab Reservation in Service Act-2006 . Government issued one circular No.1818-SW-75/10451 dated 5-5-1975 in which out of seats reserved for SC caste 50% vacancies offered to Balmikis & Mazhabi Siks ( Punjab మదిగలకు). ఇక్కడే మొదలైంది ఈ కేసును (2)EV.Cinnaiah vs State of AP & others (2005)1,scc394 ,AP కి సంభందించిన ABCD లు Stop చేసిన కేసుకు ముడిపెట్టి 14 సం తర్వాత సుదీర్ఘ న్యాయపోరాటం 3 Days Orguments ద్వారా పరిష్కరా దిషగా ముందుకు సాగిందని నేనూ Happy గా feel అవుతున్నాను. ఈ case లో Impleade (Join) నా అదృష్టం(3) 27.8.2020 నుంచి ఈ కేసు లో AP,TS, State మాదిగలు 9 సం. గా Implead కాలేదు నేనూ as an Advocate గా అన్ని గ్రూప్లాలో posting పెట్టిన తర్వాతే అందరూ కళ్ళు తెరిచి Implead అయినందుకు అందరికీ నా ధన్యవాదములు.(4) Coming to the point on 8.2.2024 supreme court లో Mr.Suresh Kumar Karanam & Suresh Kumar పొత్తూరి గారు AP మాదిగల తరపున వాదనలు వినిపించారు, written Orguments లో మనం File చేసిన 6600 పేజీల evidence నుంచి main points of Justice Usha Mehra Commission నుంచి 28 పేజీల Stastics.4 years మదిగలు అనుభవించిన ఫలాల పలితాలు పొందుపరచడం జరిగింది.(5) SC లు homegeneous(of the same nature or variety) కాదని prove చేయడం జరిగింది.(6) EV.Chinnaiah vs State of AP casu Revisited చేయడం ద్వార దీన్ని Set aside చేయడం (7) Mandala Commission లో follow అయిన Creamy Layer System ద్వారా SC Community లో Most Advanced Community IAS,IPS లాంటి వారిని reservations నుంచి eliminate చేయబోతున్నారు.(8) దీని ద్వార India లోని నా మదిగాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.(9) ఎన్నో కష్టాలు, వ్యయ ప్రయాసలకోర్చి ఈ కేసులో Implead అయినందుకు చాలా ఆనందంగా ఉంది.(10) ఈ కేసు లో నాకు సహకరించిన Mr.Sanjaya Kumar Sr.Advocate Khammam,Mr.Chiranjeevi Vijayavada(Impleading party) Mr.Rajagopal Anantapur (IP). మరియు ఓ అజ్ఞాత Doctor From Abroad. అందరికీ నా ధన్యవాదములు message From.Butti.Ramachandrudu. MA, BL,& LL M. Advocate Tirupathi 🙏 Ph 7075426423.🙏
...
దిశ, నేషనల్ బ్యూరో : ఎస్సీ, ఎస్టీలలో ఉప వర్గీకరణ చేసి.. ఆయా వర్గాల రిజర్వేషన్ కోటా నుంచి సబ్ కోటాను కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలా ? వద్దా ? అనే దానిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలలోని అందరూ సామాజిక, ఆర్థిక, విద్య, సామాజిక స్థితిగతుల పరంగా ఒకే విధమైన స్థితిగతుల్లో ఉండకపోవచ్చని పేర్కొంది. ఈ వర్గాలలోని వారంతా అన్ని అంశాలలో ఒకే విధమైన స్టేటస్‌ను అనుభవిస్తున్నారని భావించడం అపోహే అవుతుందని తెలిపింది. ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం’ కేసులో 2004లో ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రస్తావనకు వచ్చిన సందర్భంగా ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది. ‘‘ఎస్సీ, ఎస్టీలంతా ఒకేవిధమైన స్థితిగతులను కలిగి ఉంటారు. అందుకే వారిలో ఉప వర్గీకరణ చేసే హక్కు కానీ.. రిజర్వేషన్ కోటాలో ఉప కోటాను క్రియేట్ చేసే అధికారం కానీ రాష్ట్రాలకు ఉండదు’’ అని ఆ కేసులో 2004లో వచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు ప్రస్తుత ధర్మాసనం విభేదించింది. కేంద్ర సర్కారు తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ‘ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం’ కేసు తీర్పుతో విభేదించారు. ప్రజలకు సమానమైన అవకాశాలను కల్పించాలన్న రాజ్యాంగపరమైన రక్షణను తిలోదకాలు ఇచ్చేలా ఆ తీర్పు ఉందన్నారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీలలో ఉప వర్గీకరణ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
...దిశ.9.2.2024
....
సుప్రీం కోర్టు - చివరి రోజు - విషయాలు.
విచారణ ముగిసింది .
తీర్పు రావడం మిగిలి ఉంది.
ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీం కోర్టులో ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం చేస్తున్న విచారణ నేటితో ముగిసింది.
చివరి రోజు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వారి తరుపున న్యాయవాదులు వినిపించారు.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వాదించిన వారిలో మనోజ్ స్వరూప్ గారు ప్రముఖ న్యాయవాది.
అలాగే ఈరోజు కూడా కపిల్ సిబాల్, అటార్నీ జనరల్ వెంకట రమణి గారు కూడా వాదనలూ చెప్పారు.
వర్గీకరణ వ్యతిరేక వాదనలు పూర్తి అయిన తరువాత చివరిగా వర్గీకరణ వ్యతిరేక వాదనలు కౌంటర్ చేస్తూ వర్గీకరణ కోరుతూ ప్రముఖ న్యాయవాది గుర్మిందర్ సింగ్ గారు వాదనలు వినిపించారు.
గుర్మిందర్ సింగ్ గారి వాదనలతో ఇరు వైపుల వాదనలు పూర్తయ్యాయి.
చీఫ్ జస్టిస్ చంద్ర చుడ్ గారు నేటితో విచారణ ముగిసిందని ప్రకటించారు.
తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ఆర్డర్స్ ఇచ్చారు.
మూడు రోజుల పాటు ఉత్కఠభరితంగా కొనసాగిన విచారణ పూర్తి అయింది.
త్వరలోనే తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం.
చివరి రోజు మధ్యాహ్నం వరకు సుప్రీం కోర్టులోనే ఉన్న మంద కృష్ణమాదిగ గారు కేబినెట్ కార్యదర్శితో జరిగే సమావేశానికి వెళ్ళిపోయి ఆ సమావేశాన్ని ముగించుకొని తిరిగి సాయంత్రం కోర్టుకు చేరుకున్నారు .
MLF జాతీయ అధ్యక్షలు V వెంకట రత్నం,YK విశ్వనాథ్ గారు, వీరేష్ కుమార్, , మట్ట జయకర్, బైరపాక జయకర్, సురేశ్, ఆనంద్ తదితరులు విచారణలో పాల్గొన్నారు.
తీర్పు కోసం ఎదురు చూద్దాం..
న్యాయం గెలుస్తుందని నమ్ముదాం.
గోవిందు నరేష్ మాదిగ.
MRPS రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్రం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి