గుర్రం జాషువా 128వ జయంతి 29.09.2023.
దిశ, శేరిలింగంపల్లి : బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ (బీఎస్ఎఫ్-హెచ్సీ యూ) కవికోకిల గుర్రం జాషువా 128వ జయంతిని పురస్కరించుకొని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జాషువా కవిత్వంలో దేశభక్తి అనే అంశంపై ఆయన మా ట్లాడుతూ.. జాషువా తెలుగు సాహిత్యానికి అందించిన సేవలను, సా మాజిక అభ్యుదయం కోసం ఆయన పాటుపడిన అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య బాణాల భుజంగ రెడ్డి, జాషువా కవిత్వంలో దళిత, బహుజనతత్వం గురించి కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత పసునూరి రవీందర్, జాషువా సాహి త్యంలో దార్శనికత అనే అంశంపై మానస ఎండ్లూరి మాట్లాడారు. జాషు వా సాహిత్యంలో ప్రాపంచిక దృక్పథం అనే అంశంపై గురుకుల డిగ్రీ లెక్చరర్గా పనిచేస్తున్న డా. భారతి ప్రసంగించారు. కార్యక్రమానికి గుంటి రోహిత్ పరిశోధక విద్యార్థి సభాధ్యక్షత వహించారు.







కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి