"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

03 అక్టోబర్, 2023

డా.జె.వి.చలపతిరావుగారి పద్యాలు

 


ఆచార్య!వందనములు !

తే.గీ.

ఆధునిక సాహితీ సంపదయిది నాటి

కవుల రచనల సొగసును కనగ జేసె

విశ్వవిద్యాలయాలల విజ్ఞులెల్ల

పలుకుదేనెల విలువలు బంచినారు


తే.గీ.

తెలుగు వెలుగుల విజ్ఞాన తేజమిదియె 

విశ్వమంతయు విలువల విస్తరిల్ల

ఛత్రపతి శౌర్యదీప్తులు చాటిచెప్పె

నందనంబిది యాచార్య!వందనములు !


అభినందనలతో...💐💐 కవికోకిల,డా.జె.వి.చలపతిరావు, 

అధ్యాపకులు , తెలుగు శాఖ, విజయవాడ


(29.9.2023 వతేదీన  జంగారెడ్డిగూడెం లో జరిగిన అంతర్జాతీయ సదస్సు 'ఆధునిక తెలుగు సాహిత్యంలో భిన్న కోణాలు 'లో నా ప్రసంగానంతరం డా. జె‌.వి.చలపతిరావుగారు వర్ణించిన పద్యాలు. ధన్యవాదాలు సర్)





కామెంట్‌లు లేవు: