కలలు విరిగిన చప్పుడు!
వాటికి
మన ఇష్టాయిష్టాలతో పనేముంది?
నవ్వించవచ్చు
కవ్వించవచ్చు
సంగీతమై వినిపించవచ్చు
సంతాపాన్నీ ప్రకటించవచ్చు
మనసుని
దూదిమేడల్లో ఊరేగించవచ్చు
ధూళికణాల్లోనూ విసిరెయ్యవచ్చు
అవి కలలు
పన్నీటి జల్లులవుతాయి
అవి కలల్లోనే
కన్నీళ్ళ జల్లులవుతాయి
ఆ కలల కూలిన చప్పుడికి
భూ నభోంతరాలు దద్దరిల్లకపోవచ్చు
మనసుని మాత్రం ముక్కలు ముక్కలు చేసెయ్యొచ్చు!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి