ఆంధ్ర ప్రదేశ్ తెలుగు-సంస్కృత అకాడమీ సందర్శన
8.8.2023 వ తేదీన ఒక ఒక ప్రాజెక్టు విషయ నిపుణులుగా నేను, మరికొంతమంది సభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగు - సంస్కృత సాహిత్య అకాడమీ, తాడేపల్లి కార్యాలయానికి వెళ్ళాం. ఈ సందర్భంగా చైర్ పర్సన్ డా.నందమూరి లక్ష్మీపార్వతిగారిని కలిసినప్పటి దృశ్యం. తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు, ప్రచురిస్తున్న పుస్తకాలు, వివిధ సాహిత్య విషయాలు చర్చించారు. వారు రాసిన మూడు పుస్తకాలు 'వైదేహి' , పుంజిక(నవలలు), అల్లుడు సుద్దులు ఇచ్చారు.
ఆమెతో చర్చించినంతసేపూ అనేక సాహిత్య విషయాలు ప్రస్తావించారు. భారతీయ సాహిత్యం, చరిత్ర, సంస్కృతులకు జరిగిన అన్యాయానికి ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. భారత, రామాయణాల రచనా తీరు, దాని వికాసంలో ద్రావిడుల చరిత్ర, సంస్కృతులకు జరిగిన అన్యాయాన్ని సోదాహరణంగా వివరించారు. మహాకవి కాళిదాసు, భారవి, భాసుడు వంటి ఎంతోమంది కవుల చరిత్రల విషయంలో సరైన విషయాలు వెలుగులోకి రాలేదన్నారు. ఆమెతో సాహిత్య చర్చలు చేసినంత సేపు మాకు సమయం తెలియలేదు. త్వరలో తెలుగు, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో ఒక నిఘంటువు తీసుకొస్తున్నామని చెప్పారు. నాతో పాటు డా.కాలువ మల్లయ్య, బెందాళం కృష్ణారావుగార్లు కూడా ఈ సాహితీ చర్చల్లో పాల్గొన్నారు. … ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్.
తెలుగు -సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ డా.నందమూరి లక్ష్మీపార్వతిగారి నుండి వారి పుస్తకాలను స్వీకరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
చైర్ పర్సన్ డా.నందమూరి లక్ష్మీ పార్వతిగారిని మర్యాదపూర్వకంగా కలిసి వివిధ విషయాలపై చర్చించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ కాలువ మల్లయ్య, శ్రీ బెందాళం కృష్ణారావుగార్లు.
తెలుగు- సంస్కృత అకాడమీ నామ సూచిక ముందు సభ్యులు ఆచార్యదార్ల వెంకటేశ్వరరావు , డాక్టర్ కాలువ మల్లయ్య , శ్రీ బెందాళం కృష్ణారావు.




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి