జాతీయోద్యమం వల్లనే స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలు
భారత జాతీయోద్యమ సాహిత్యాన్ని స్వాతంత్ర్యానికి పూర్వం, తర్వాత వచ్చిన సాహిత్యంగా విభజించు కావచ్చునని, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి నూతన భావనలతో పాటు వ
భౌగోళిక ప్రాంతాల సరిహద్దులు లేని విశ్వైకభావన వంటి భావనలు జాతీయోద్యమ సాహిత్యం వల్ల ఏర్పడ్డాయని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ మరియు భాషా, సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారి సంయుక్త నిర్వహణలో ‘జాతీయోద్యమంలో తెలుగు సాహిత్యం పాత్ర’ అనే అంశంపై రవీంద్ర భారతి మినీహాల్, హైదరాబాద్ లో జరుగుతున్న రెండు రోజుల సదస్సులో ఈరోజు తొలి సమావేశంలో హెచ్ సియు, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొని ' జాతీయోద్యమ సాహిత్యం: కొత్త భావనలు' అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయోద్యమ ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తున్న కొత్త భావనలను నాలుగు విధాలుగా వర్గీకరించుకోవచ్చునని వాటిని విశ్లేషించారు. రాచరికం, నిరంకుశ విధానాలు చవిచూసిన ప్రజలు యూరప్ లో వచ్చిన అనేక పురాణాలు, ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం వల్ల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి కొత్త భావనలు జాతీయ ఉద్యమంలో కనిపిస్తున్నాయన్నారు. వీటిని భారతీయ కవులు, తెలుగు కవులు ముఖ్యంగా
బంతించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, గరిమెళ్ళ సత్యనారాయణ, చిలకమర్తి,
కుసుమ ధర్మన్న జాషువా అంటి వాళ్ళందరూ జాతీయోద్యమస్పూర్తితో స్వాతంత్ర్య ఆకాంక్షను వ్యక్తీకరించే కవిత్వాన్ని రాసారని ఆయన సోదాహరణంగా వివరించారు. తొలి సమావేశానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్. వి.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, డా.నాగసూరి వేణుగోపాల్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు ప్రారంభో ప్రారంభ సమావేశంలో
సాహిత్య అకాడమీ ఢిల్లీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు,
తెలుగు సలహా మండలి కన్వీనర్ ఆచార్య సి. మృణాళిని, వాడ్రేవు చిన వీరభద్రుడు, డా.మామిడి హరికృష్ణ ,డా.కోయి కోటేశ్వరరావు, డా దోరవేటి పి.చెన్నయ్య, డా.రఘుశ్రీ, డా.నాళేశ్వరం శంకర్, డా.లావణ్య, డా.దేవేందర్, మహేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి