అందరికీ జ్ఞానం అందాలనేదే గిడుగు భాషాదృక్పథం
సామాన్యులకు కూడా అన్ని రంగాల్లో గల విజ్ఞానం భాష ద్వారా అందుకోవాలనేదే గిడుగు రామమూర్తి పంతులు గారి వ్యవహారిక భాషా ఉద్యమ దృక్పథం అని ఆచార్యదార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. తెలుగు భాషా వారోత్సవాలలో భాగంగా టంగుటూరి ప్రకాశం, గిడుగు రామమూర్తి జయంతి ఉత్సవాలలో భాగంగా సేవ తెలుగు భాష సాహితీ,సాంస్కృతిక సంస్థ, నెల్లూరు, తిరుపతి వారు సోమవారం నాడు అంతర్జాలం ద్వారా నిర్వహించిన సమావేశంలో 'గిడుగు వ్యావహారిక భాషా దృక్పథం' గురించి హెచ్ సియు, సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడారు. సవరల భాష, సాహిత్యం, సంస్కృతులను గిడుగు పరిశోధన, రచనలు ఆయనలోని అభ్యుదయ దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తాయని ఆచార్య దార్ల వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి రాసిన రచనలు, ఆయన ఉద్యోగం అన్నీ వ్యావహారిక భాషాభివృద్ధికి తోడ్పాటు అందించాయని వివరించారు. గిడుగు భాషావ్యాసాలు, వాటిలోని వివిధ అంశాలపై డా.బాణాల భుజంగరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సేవ సంస్థ అధ్యక్షులు కంచర్ల సుబ్బానాయుడు, డా.కొణిదల శోభ, డా.బోర భారతీదేవి, సొతకు రత్నజానకి తదితరులు పాల్గొన్నారు
.









కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి