శుభోదయం సర్
అప్పుడే ఒకరోజు గడిచిపోయింది
నిన్నటి మీ శుభోదయం
నేటికీ తాజాగానే ఉంది
నా శుభోదయం ఎలా ఉందో
నేను క్షేమం
క్షమమనే చెప్పాలి కదండీ
పొద్దున్నే బాబుని లేపడం, స్కూల్ కి పంపడం
పంపాక 'అమ్మయ్య...ఎంత పని పూర్తయ్యంద'నిపించే గొప్ప నిట్టూర్పు.
బహుశా
మీరు కూడా మీ మనవరాలినో
మీ మనవడినో ఇలా బుజ్జగిస్తుంటారను కుంటాను
ఒకవేళ ఆ పని మీకు లేకపోతే
మీ కోడలో, మీ కొడుకో చేస్తుంటే
మీ గతకాలపు జ్ఞాపకాలు గుర్తొస్తుండొచ్చు
అవి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుండవచ్చు
ఇలా ప్రతి రోజూ...ఒక్క అది వారం తప్ప...
ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి...
మళ్ళీ ఎప్పుడన్నా రాస్తాను లెండి...
అదిగో ఇప్పటికే ఆగకుండా ఫోన్ మోగుతోంది.
నిజానికి ఆ ఫోన్ నా సమయమంతా తినేస్తుంది .
ఇలా ఉన్నాను సర్.
మీ క్షేమం సమాచారంతో
మీరు కూడా ఓ విద్యుల్లేఖ రాయండి.
ఉంటాను
మీ
దార్ల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి