"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

12 జులై, 2023

ఈ రోజెందుకో కొత్తగా ఉంది

 ఈ రోజెందుకో కొత్తగా ఉంది 

 ఈ సూర్యోదయం ఎందుకో కొత్తగా ఉంది

నవ్వుతూ కౌగిలించుకుంటున్న

ఈ ప్రభాత సమయాన్ని చూడు

నీ చుట్టూ  ఎదురుచూస్తున్న

అందమైన పూబాలల అమాయకత్వం

ఇంతకుముందు ఏమీ జరగనట్లే 

మళ్లీ ఆ పసిపిల్లల్లా స్వచ్ఛమైన నవ్వులు రువ్వుతూ

మన ఒడిలోకొచ్చి వాలిపోతున్నట్లున్నాయి

ఎందుకో ఈ ప్రభాతమెంతో కొత్తగా ఉంది



ఎప్పటిలాగే ఈనాడు కూడా తెల్లవారినా

ఈ రోజెందుకో నిర్మలంగా మారి కొత్తగా మత్తుగాఉంది

మబ్బులు తొలిగిపోయిన

రహదారేదో వెలుగురేఖలతో స్వాగతం పలుకుతున్నట్లుంది


దారికి  రెండువైపులా

సుకుమారమైన చేతులేవో

నీ రక్షణ కవచాలమంటూ

హృదయానికి హత్తుకుంటున్నట్లున్నాయి


ఎవరో ఒక మహరాణి  

నిర్భయంగా, హుందాగా అడుగులేస్తుంటే

ఈహృదయం నిండా

కోటిభావాలేవో ఉప్పొంగుతున్నట్లున్నాయి


ఈ రోజెందుకో కొత్తగా ఉంది

అశాంతి చీకట్లను జయించాక

కోరివచ్చిన మనసేదో ప్రేమపరిమళాల్ని 

నిలువెత్తు దండనే వేసినట్లుంది!

  • ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

6.7.2023


కామెంట్‌లు లేవు: