ఈనాడు దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో
దిశ దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో
భూమి పుత్ర దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో
నమస్తే తెలంగాణ దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో
నమస్తే దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో
సాక్షి దినపత్రిక, 9.6.2023 సౌజన్యంతో
డా. జి.వి.రత్నాకర్ గారి రెండు గ్రంథాల ఆవిష్కరణ
భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలకమైన పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమరయోధుడు మాతాదిన్ భంగీ, కానీ, మంగల్ పాండేని మాత్రమే చరిత్రకారులు అత్యధికంగా కీర్తిస్తారని, చరిత్ర పునర్నిర్మాణం జరగవలసిన అవసరం ఉందని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య పి కనకయ్య వ్యాఖ్యానించారు. గురువారం (8.6.2023) మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం గచ్చిబౌలిలో హిందీ శాఖ అధ్యక్షుడు డాక్టర్ జి వి రత్నాకర్ రచించిన 'ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు మాతాదీన్, హిందీ అనువాదం కుసుమ ధర్మన్న గ్రంథాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య పి కనకయ్య ఆవిష్కరించి మాట్లాడారు.
డాక్టర్ జి వి రత్నాకర్ హిందీ నుండి తెలుగులోకి, తెలుగు నుండి హిందీలోకి చేస్తున్న అనువాదాలు భారత దేశంలోని భిన్న జాతుల సంస్కృతులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఝల్కారీ భాయ్ జీవిత చరిత్రను తెలుగువారికి పరిచయం చేసిన డాక్టర్ జి వి రత్నాకర్ ఇప్పుడు మాతాదీన్ భంగి జీవితాన్ని పరిచయం చేయడం ద్వారా దళిత, బహుజన, గిరిజన యోధులు చేసిన భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర బయటకు వస్తుందని చెప్పారు. రచయిత డాక్టర్ జి వి రత్నాకర్ మాట్లాడుతూ తెలుగు నుండి కొన్ని రచనలు హిందీలోకి వెళ్లకపోతే తెలుగులో వచ్చిన గొప్ప సాహిత్యం ఉత్తరాది వారికి తెలియదని అందువలన తెలుగు నుండి హిందీకి కొన్ని రచనలను అనువాదం చేస్తున్నారని చెప్పారు. అలాగే హిందీ నుండి తెలుగులోకి కొన్ని రచనలు రావడం వలన తెలుగు సాహిత్యంలో పూరించవలసిన ఖాళీలు ఏమిటో తెలుస్తాయని, అందువలనే హిందీ నుండి తెలుగులోకి కూడా కొన్ని అనువాదాలు చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ శాఖ నుండి డాక్టర్ ఓం ప్రకాష్ , డాక్టర్ శరశ్చంద్ర, హిందీ నుండి డాక్టర్ దొడ్డా శేషుబాబు, డా.సంగీతరావు తదితరులు ఈ పుస్తకావిష్కరణ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇటీవలే రిజిస్ట్రార్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆచార్య పి కనకయ్య గారిని డాక్టర్ జివి రత్నాకర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి