23 May, 2023

ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డిగారి మరణం తెలుగు సాహిత్యానికి తీరనిలోటు

 

భూమిపుత్ర దినపత్రిక,25.5.2023 సౌజన్యంతో 

భూమిపుత్ర దినపత్రిక, 23.5.2023 సౌజన్యంతో 


నమస్తే దినపత్రిక, 23.5.2023 సౌజన్యంతో 

దిశ దినపత్రిక, 23.5.2023 సౌజన్యంతో


‘‘తెలుగు సమాజం ఒక ఉత్తమ విద్యావేత్త, కథారచయిత ను కోల్పోయింది’’


ప్రముఖ కథా రచయిత, అధ్యాపకులు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు (22.5.2023) మరణించడం తెలుగు సాహిత్యానికి తీరని లోటు. ఆయన సుదీర్ఘ కాలం పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పని చేశారు. ఆ సమయంలో బిఏ, ఎంఏ తెలుగు విద్యార్థులకు ఎన్నో ఉత్తమమైన పాఠ్యాంశాలకు రూపకల్పన చేశారు. పీడితుల పక్షాన నిలబడి అనేక కథలు రాశారు. జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు పేర్లతో కథా సంపుటాలుగా కూడా ఆయన కథలు వెలువడ్డాయి. ఆయన కథలు పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. అనేక విశ్వవిద్యాలయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గా కొత్త కొత్త పాఠ్యాంశాలు పెట్టారు. ఆయన మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు . వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్

 సాక్షి  దినపత్రిక, 23.5.2023 సౌజన్యంతో

No comments: