"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

24 May, 2023

సమ సమాజాన్ని ఆకాంక్షించిన సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి( సంతాప సభ, 23.5.2023)లో వక్తలు


     దిశ దినపత్రిక, 24.5.2023 సౌజన్యంతో 
నమస్తే తెలంగాణ దినపత్రిక, 24.5.2023 సౌజన్యంతో 

సమ సమాజాన్ని ఆకాంక్షించిన సాహితీవేత్త కేతు విశ్వనాథరెడ్డి

తెలుగు భాషా సాహిత్యాలకు విశేషమైన సేవలు అందించిన ప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి అని హెచ్ సి యూ తెలుగు అధ్యాపకులు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. మంగళవారం తెలుగుశాఖలో శాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన కేతు విశ్వనాథరెడ్డి సంతాపసభను నిర్వహించారు. 

ప్రతిధ్వని దినపత్రిక, 25.5.2023 సౌజన్యంతో 


ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారు 22. 5. 2023వ తేదీన ఒంగోలులో తన కుమార్తె ఇంటిదగ్గర గుండెపోటుతో మరణించారు. ఆయన తన భార్యను ఆసుపత్రిలో చూపించడానికి ఒంగోలు వచ్చారు. హఠాత్తుగా ఆయనకు తెల్లవారుజామున గుండెపోటు వచ్చి మరణించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారి సంతాప సభలో ముందుగా ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి చిత్రపటానికి తెలుగు అధ్యాపకులు పూలమాలవేసి, అంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. తర్వాత ఆయన తెలుగు భాషా సాహిత్యాలకు చేసిన సేవను గుర్తుచేసుకున్నారు.

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కథలు రాయడం కంటే ముందు వేర్లు, బోది నవలలను రాశారని, ఆ తర్వాత కథారచయితగా ఎంతో పేరు పొందారని, భాషా, సాహిత్య రంగాలు మాత్రమే కాకుండా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా కూడా ప్రామాణిక పాఠ్యాంశాల రూపకల్పన చేశారని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆయన కొడవటికంటి కుటుంబరావు సాహిత్యానికిశసంపాదకత్వం వహించినప్పుడు అనేక విషయాలను పరిశోధత్మకంగా తెలియజేశారని వివరించారు. గురజాడ అప్పారావు గారి సాహిత్యాన్ని సంకలనం,సంపాదకత్వం వహించినప్పుడు సెట్టి ఈశ్వరరావు గారు ఎలాగైతే ప్రతి విషయాన్ని కూలంకుషంగా రిఫరెన్స్ లతో సహా వివరించేవారో, ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారు కూడా కొడవటిగంటి సాహిత్యాన్ని అంత సమర్థవంతంగా సంపాదకత్వం వహించారని ఆచార్య దార్ల అన్నారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో తెలుగు పాఠ్యాంశాలు ఎంతో ప్రామాణికంగా తీసుకువచ్చిన ఘనత కూడా ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారికి దక్కుతుందని ఆచార్య వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తన దగ్గర పరిశోధన చేసిన బాలిరెడ్డి రాయలసీమ దళిత నవలలపై చేసిన పరిశోధనలు ఆచార్యకేతు విశ్వనాథరెడ్డిగారి బోధి, వేర్లు నవలలను కూడా తన పరిశోధనలో తీసుకున్నాడని ఈ సందర్భంగా ఆచార్య దార్ల వివరించారు. పడవలల్లో రిజర్వేషన్లను అనుభవిస్తున్నటువంటి వారు కేవలం కొంతమంది అయితే కనుక ఆశించిన ఫలితాలు రావని క్రిమిలేయర్ ఆవశ్యకతను తెలియజేశారని ఆచార్య దార్ల పేర్కొన్నారు. అంతేకాకుండా, తమ కులవృత్తులను కాదని ఇతర వృత్తుల్లోకి ప్రవేశించినప్పుడు, వాటిలో నిలదొక్కుకోవడానికి పడే సంఘర్షణ కూడా ఆ నవలల్లో చిత్రించారని ఆయన సోదాహరణంగా వివరించారు. తాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు విషయనిపుణులుగా ఆచార్య కోవెల సంపత్ కుమార్ ,ఆచార్య చేకూరి రామారావులతో పాటు ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారు కూడా వచ్చారని గుర్తు చేశారు. 

ఆయన కింది వర్గాలవారిని ఎంతగానో ప్రోత్సహించేవారనీ, గిరిజనుల తీజ్ పండుగ గురించి పాఠశాల స్థాయిలో పాఠ్యాంశం పెట్టించారని ఆచార్య ఎం.గోనానాయక్ గుర్తు చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా తాను డాక్టరేట్ చేసిన తర్వాత తనను ఎంతగానో ప్రోత్సహించే వారిని ఆచార్య గోనా నాయక్ వివరించారు. ఆచార్యకేతు రాసిన బోధి వేర్లు నవలపై తాను ఒక వ్యాసాన్ని రాసి ఆయనకు చూపించినప్పుడు ఆయన ఎంతో సంతోషించారని గుర్తు చేసుకున్నారు. 

సాహిత్య రంగంలోనే కాకుండా భాషా రంగంలో కూడా ముఖ్యంగా గ్రామ నామాలు, మాండలికాలపై విశేషమైన కృషి చేసిన కేతు విశ్వనాథరెడ్డి తెలుగు పత్రికా రంగంలో వ్యావహారిక భాష అభివృద్ధికి కూడా కృషి చేశారని ఆచార్య డి. విజయలక్ష్మి అన్నారు. విశ్వవిద్యాలయాలలో జాతీయ సదస్సులు నిర్వహిస్తే కీలక ఉపన్యాసాలకు పిలిచినప్పుడు ఆ పిలిచిన వ్యక్తి తెలిసిన తెలియకపోయినా సదస్సును జయప్రదం చేయడానికి ఆయన ఇచ్చేసేవారిని డాక్టర్ భూక్య తిరుపతి వివరించారు.తెలుగులో గ్రామనామాలపై తొలిపరిశోధన చేశారని,గ్రామనామాలపై ఆయన చేసిన పరిశోధన ఎంతో శాస్త్రీయమైందని డా.బాణాల భుజంగరెడ్డి పేర్కొన్నారు. తాను నమ్మిన కమ్యూనిస్టు, అభ్యుదయ భావాలు తన రచనల్లో ప్రతిఫలించడమే కాదు, ఆ భావజాలాన్ని ఆచరణలో చూపిన వ్యక్తి అని డా.భుజంగరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకులు డాక్టర్ డి విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య పమ్మి పవన్ కుమార్ గార్లు సెలవులో ఉన్నారు. తమ సంతాపాన్ని కూడా తెలియజేయమని సమాచారాన్ని పంపించారు. 

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటించి ఆయన గురించి మాట్లాడుతున్న తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటించి ఆయన గురించి మాట్లాడుతున్న తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు


ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న తెలుగు  శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎం.గోనా నాయక్ , ఆచార్య డి. విజయలక్ష్మి, డాక్టర్ భూక్య తిరుపతి, డాక్టర్ బాణాల భుజంగ రెడ్డి , డాక్టర్ దాసర విజయ కుమారి ఈ చిత్రంలో ఉన్నారు.



మన తెలంగాణ దినపత్రిక, 24.5.2023 సౌజన్యంతో 

చెన్నై, తెలుగు టైమ్స్ దినపత్రిక, 24.5.2023 సౌజన్యంతో 
ఆంధ్ర ప్రభ దిపత్రిక, 24.5.2023 సౌజన్యంతో 



    ఈనాడు దినపత్రిక, 24.5.2023 సౌజన్యంతో 


సాక్షి దినపత్రిక, 24.5.2023 సౌజన్యంతో 

తరుణం దినపత్రిక, 24.5.2023 సౌజన్యంతో 


      నమస్తే దినపత్రిక 24.5.2023 సౌజన్యంతో 

నవతెలంగాణ దినపత్రిక, 23.5.2023 సౌజన్యంతో 

నీవు తెలంగాణ దినపత్రిక, 24.5.2023 సౌజన్యంతో 


No comments: