హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ విద్యార్ధుల సమ్మేళనం
ఆచార్య పరిమి రామనరసింహం గార్ని సత్కరిస్తున్న తెలుగు శాఖ పూర్వ విద్యార్ధులు (2000-22)ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్ని సత్కరిస్తున్న తెలుగు శాఖ పూర్వ విద్యార్ధులు (2000-22)
ఆచార్య పిల్లలమర్రి రాములు గార్ని సత్కరిస్తున్న తెలుగు శాఖ పూర్వ విద్యార్ధులు (2000-22)
ఆచార్య డి.విజయలక్ష్మి గార్ని సత్కరిస్తున్న తెలుగు శాఖ పూర్వ విద్యార్ధులు (2000-22)
డా.బాణాల భుజంగరెడ్డి గార్ని సత్కరిస్తున్న తెలుగు శాఖ పూర్వ విద్యార్ధులు (2000-22)
విద్యార్థిగా వ్యక్తిగతంగా సాధించిన తమ ప్రతిభను సమాజానికి అందేటట్లు కృషి చేయాలనీ,విశ్వ విద్యాలయంలో చదువుకునే ప్రతి శిష్యుడు గురువుకు సహకారేనని ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య పరిమి రామనరసింహం వ్యాఖ్యానించారు.భాషను తమ తల్లిదండ్రులు, సమాజానికి అందుబాటులోకి తీసుకొనిరావాలనీ, ఆ విధంగా తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడాలని, సృజనాత్మక సాహిత్యం వల్లనే భాష అంతరించిపోయే ప్రమాదం తప్పుతుందని ఆచార్య పరిమి రామనరసింహం చెప్పారు.
శనివారం (27.5.2023) తెలుగు శాఖ, హెచ్ సి యూ పూర్వ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనం శాంతిశ్రీ ప్రార్థనా గీతంతో ప్రారంభించారు.
ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ విద్యాసంస్థలకు వివిధ మార్గాల్లో సహాయ సహకారాలను అందించడానికి ముందుకు రావాలని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సూచించారు. వ్యక్తిగతంగా తాము పొందిన విజ్ఞానాన్ని, లాభాన్ని వ్యవస్థీకృతంగా పంచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ తల్లిదండ్రులపేరుతో స్వర్ణ పతకం, ఒక భవనం నిర్మించడం వంటి రూపాల్లో తాము చదువుకున్న విద్యాసంస్థలకు అందించవచ్చుననీ, దానిద్వారా న్యాక్, యూజీసీ, తదితర సంస్థలు ఉత్తమ ర్యాంకింగ్ రావడానికి తోడ్పడతాయని పేర్కొన్నారు.
సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్థులందరినీ డా.తన్నీరు కళ్యాణ కుమార్ పరిచయం చేశారు. వారంతా వివిధ కళాశాలల్లో అధ్యాపకులుగా, తెలుగు పండితులుగా, బోధనేతర సిబ్బందిగా పనిచేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య డి.విజయలక్ష్మి, డా.బాణాల భుజంగరెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్ధుల సమ్మేళనాల వల్ల విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య ఆత్మీయానురాగాలు పెరుగుతాయనీ, అది విద్యార్థుల్లో నూతనోత్సాహం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా తమ గురువులను ఘనంగా సత్కరించుకున్నారు.
పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన డా.వరప్రసాద్ గార్ని అభినందన సత్కారం చేస్తున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు, అధ్యాపకులు
పూర్వ విద్యార్ధుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన డా.కోలాశేఖర్ గార్ని అభినందన సత్కారం చేస్తున్న హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు, అధ్యాపకులు
పూర్వ విద్యార్ధులను గురువులు అభినందన సత్కారం చేశారు. పూర్వ విద్యార్ధులు డా.కెవిఎన్ డి వరప్రసాద్, డా.ఆశీర్వాదం, ప్రభాకర్, శ్రీమతి కరుణ, డా.కోలాశేఖర్, డా.రవికుమార్, నర్సింహులు, డా.గంగరాజు, మూర్తి, రెడ్డి పాషా, శ్రీనివాసరెడ్డి, డా.వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి