సంస్కృత ఆంధ్ర భాషలలో పండితుడు , సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖ మాజీ అధ్యక్షులు ఆచార్య రవ్వా శ్రీహరి (79) శుక్రవారం (21.4.2023) అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారని తెలిసింది.
ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సుదీర్ఘ కాలం పాటు తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. అనేక మంది పరిశోధకవిద్యార్థులకు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించారు. తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పంలో వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. ఆయన అనేక పరిశోధన, విమర్శ గ్రంథాలను రచించారు. శ్రీహరి నిఘంటువు ఆయనకు మంచి పేరు తెచ్చిన గ్రంథం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించిన ఆంధ్ర మహాభారతం పరిష్కరణ గ్రంథానికి సంపాదకులుగా కూడా పనిచేశారు. ఆయన మరణం సంస్కృతాంధ్ర భాషలకు తీరని లోటుగా భావిస్తున్నాం. మా తెలుగుశాఖ పక్షాన వారి కుటుంబానికి మా అధ్యాపకులు అందరమూ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, మానవీయ శాస్త్రాల విభాగం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
తేది: 22.4.2023
1 కామెంట్:
🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి