నమస్కారం గురూజీ....
మీరు చెప్పిన అలంకార శాస్త్రం...
నిత్య జీవితంతో కొనసాగే జీవ నదీ తరంగం...మా వ్యక్తిత్వానికి అలంకార ప్రాయం...
మీ అలంకార శాస్త్రం విన్న తర్వాత జీవన శైలి , ఆలోచనా దృక్కోణం... సమాజంపై సహేతుకమైన అవగాహన కలిగి... నాలోని ఊహించని మానసిక పరివర్తనకు నిదర్శనం... గురూజీ.... మీరు వర్ణించే విధానం , వివరించే ఉదాహరణలు... జ్ఞాపక శక్తి ఉన్నంత వరకు ఉంటాయి... ఆలోచింపజేస్తుంటాయి.... మీ నవరస హావభావ విన్యాసం ఆద్యంతం ఆసక్తికరం ... ఒక అధ్యాపకుడిగా నాకు కూడా స్ఫూర్తిదాయకం... మీ teaching style నా జీవితం లో నభూతో నా భవిష్యతి. మీ teaching అనన్యసామాన్యం... జ్వాజ్వల్యమానం...తెలుగు శాఖకి మరిన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలరని త్రికరణ శుద్ధితో భావిస్తూ... మిమ్మల్ని... మీ teaching ని.... మీ వ్యక్తిత్వాన్ని అమితంగా అభిమానించే మీ అభిమాని....
గుంజోళ్ళ గురవయ్య ,
తెలుగు అధ్యాపకుడు.
(22.4.2023)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి