డాక్టర్ దామెర సుమన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివిన ఒక చైతన్యవంతమైన దళిత విద్యార్థి. అతడు తాను వచ్చిన అడుగులను మర్చిపోని ఉద్యమ బాటసారి. యూనివర్సిటీ హైదరాబాదులో దళిత విద్యార్థి సంఘం తరఫున అతడు అనేక సామాజిక చైతన్యంతో కూడిన కార్యక్రమాలు నిర్వహించాడు. అడ్మిషన్ సమయంలో అనేకమంది విద్యార్థులకు కుల,మత, ప్రాంత భేదాలు లేకుండా అతడు అనేకమందికి సహాయం అందించాడు. ఒకవైపు దళిత విద్యార్థి సంఘం లో ఒక విద్యార్థి నాయకుడిగా దళితులలో గొప్ప ఆత్మ గౌరవ చైతన్యాన్ని నింపడంలో సుమన్ పాత్ర ఎంతో ఉంది. మా మరొకవైపు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘంలో ఒక నాయకుడిగా ఎన్నికలలో విజయం సాధించాడు. అధ్యాపకులతో, అధికారులతో, విద్యార్థులతో ఒక విద్యార్థి సంఘం ఎలా సమన్వయంతో పని చేయాలో సుమన్ ఆ పనిలో కీలకంగా వ్యవహరించాడు. నేను డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ గా పని చేసినప్పుడు అతడు విద్యార్థుల పక్షాన వాదించిన వాదనలు ప్రత్యక్షంగా అనేక కమిటీలలో గమనించాను. అతని వాదనలో హేతుబద్ధత కనిపించేది. అందరి విద్యార్థులకు సంబంధించిన సమస్యలను కేంద్రీకరించి మాట్లాడేవాడు. ఆ సందర్భంలో అతనిలో ఒక చక్కని నాయకత్వ లక్షణాలున్న వ్యక్తిని చూసేవాణ్ణి. ఆ విద్యార్థి నాయకుడు ఇప్పుడు అధ్యాపకుడయ్యాడు. ఇప్పుడు అతడు ఎలా పని చేస్తాడో గమనించాలని ఉంది.
మిజోరామ్ సెంట్రల్ యూనివర్సిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరిన మిత్రుడు డాక్టర్ దామెర సుమన్ కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
10.1.2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి