ప్రకృతి కన్య
జన ప్రతిధ్వని పత్రిక, 23.1.2023 సౌజన్యంతో
ఆ సుందర దృశ్యాలన్నీ చూసి
ఆమె వెళుతూ వెళుతూ
నా కళ్ళనే తీసుకువెళ్ళిందనుకున్నాను
కానీ ప్రకృతి వినిపించే ఆ సంగీతాన్నీ
ఒళ్ళు గగుర్పొడిచే ఆ సాహసాల్నీ
నువ్వు తప్పకుండా ఆస్వాదించాలంటూ
నా వినికిడినీ
నా మనసునీ
తనతోనే తీసుకుపోయింది
ఆమె
సౌందర్యరాసులు పంచుకుంటూ
నన్నూ నిన్నూ ఒకచోటే బందిస్తూ
స్వేచ్చగా ప్రవహింంచే ఓ పరిమళాల కెరటం!
దార్ల వెంకటేశ్వరరావు, 12.1.2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి