కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు డిసెంబర్ 11వ తేదీని భారతీయ భాషా దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఆదేశాలు మేరకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం వారు భారతీయ భాషల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 9వ తేదీన భారతీయ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య బిజే రావు పాల్గొని భారతీయ భాషల ప్రాధాన్యాన్ని వివరించారు. స్కూల్ ఆఫ్ ఇమానిటీస్ డి ఆచార్య వి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు, హిందీ ఉర్దూ ఇంగ్లీష్ ఇతర భాషల శాఖ అధ్యక్షులకు సన్మానం చేశారు.
హైదరాబాదు విశ్వవిద్యాలయంలో భారతీయ భాషా దినోత్సవ కార్యక్రమాలు శుక్రవారంనాడు వైభవంగా ముగిసాయి. మహాకవి, బహుభాషావేత్త, పత్రికారచయిత, సంపాదకుడు చిన్నస్వామి సుబ్రహ్మణ్యభారతి జయంతిని ఈ యేడాదినుంచి భారతీయ భాషాదినోత్సవంగా జరపాలని భారతప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గడచిన పదిరోజులుగా విద్యార్థులకు, పరిశోధకులకు, ఉద్యోగులకు బహుభాషలలో అనేకమైన భాషా సాంస్కృతిక కార్యక్రమా
లను నిర్వహించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి