ప్రసిద్ధ కథారచయిత వంగూరి చిట్టెన్ రాజుగారి సంపాదకత్వంలో వెలువడిన *డయాస్పోరా కథ, సాహిత్యం అంటే ఏమిటి?(వ్యాస సంకలనం)* తాజాగా
ఇప్పుడే అందింది. దీనిలో డయాస్పోరా సాహిత్యంపై భిన్నకోణాల్లో ప్రముఖ రచయతలు రాసిన వ్యాసాలు ఉన్నాయి. దీనిలో నా పరిశోధన వ్యాసం కూడా ఉంది. దీన్ని ప్రపంచ మహాసభల సందర్భంగా తీసుకొచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, తెలుగు శాఖలో ఎం.ఏ.తెలుగు విద్యార్థులకు ఒక ఐచ్చికాంశంగా ప్రవేశపెట్టిన' తెలుగు డయాస్పోరా సాహిత్యం - ఒక పరిచయం ' సిలబస్, కోర్సు లక్ష్యాలను కూడా ప్రచురించారు. ISBN: 978-1892408983
. ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన వంగూరి చిట్టెన్ రాజుగార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి