సెంట్రల్'వర్సిటీలో విజిలెన్స్ అవగాహన ప్రతిజ్ఞ
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మానవీయ శాస్త్రాల విభాగం వారు సోమవారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని డీన్ ఆచార్య వి.కృష్ణ వివిధ విభాగాల అధ్యక్షులు, బోధన, బోధనేతర సిబ్బంది, వీద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర విజిలెన్స్ కమీషన్ ఈ యేడాది 31 వ తేదీ సోమవారం నుండి నవంబరు ఆరో తేదీ వరకూ అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజాజీవితంలో సమగ్రతను, నిజాయితీని ప్రోత్సహించేందుకు, అవినీతి పట్ల జాగురూకథను పెంచేందుకు వీలుగా ఈ వారం పాటు నిర్వహిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, అంతరిస్తున్న భాషలు, మాతృ భాషల అధ్యయన కేంద్రం అధ్యక్షులు ఆచార్య పమ్మి పవన్ కుమార్, సిడాస్ట్ అధ్యక్షులు ఆచార్య విష్ణు శర్వాడి, హిందీ శాఖ అధ్యక్షులు ఆచార్య గజేంద్ర కుమార్ పాఠక్, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య ఎం.గోనానాయక్, డా.తిరుపతి నాయక్, డా.బాణాల భుజంగరెడ్డి, డా.దాసర విజయకుమారి బోధనేతర సిబ్బంది సురేష్ బాబు, శ్రీనివాసరావు, పవన్ కుమార్, మధుసూదన్, ఎస్.ఆర్.కె.వి.వరప్రసాద్, విద్యార్థులు వీరూ నాయక్, బ్రహ్మేందకుమార్, సరళ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి