బుక్కరాయసముద్రం (అనంతపురం) చూసి, అక్కడ ఉన్న ముసలమ్మ తల్లి దేవాలయం దర్శించి, కట్టమంచి రామలింగారెడ్డి గార్నీ, ఆయన రచించిన ముసలమ్మ మరణం కావ్యాన్ని గుర్తుచేసుకున్న సమయంలో తీసిన కొన్ని దృశ్యాలు. నిన్న (11.11.2022) వతేదీన శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో ఒక కాన్ఫిడెన్సియల్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన అనంతరం ఇలా నేను (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు), యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ తెలుగు శాఖ లో అధ్యక్షులుగా పనిచేస్తున్న ఆచార్య విస్తాలి శంకరరావుగారు కలిసిన దృశ్యాలు.
ముసలమ్మ మరణం ఆమె అమాయకత్వం వల్లనే జరిగిందో,
ఆమె అందర్నీ కాపాడాలనే ఆతృతతోనే జరిగిందో,
ఎలా జరిగినా ఆమె ఒక చారిత్రక పాత్ర.
ఆమె కోసమే
ఆమె మరణించలేదు.
ఆ ఊరివారందర్నీ కాపాడాలనేది
ఆమె త్యాగగుణం.
ఆత్యాగగుణాన్ని మాత్రం నేను గౌరవించాలనిపించింది.
ఆ దేవాలయాన్ని కట్టిందీ,
దాన్ని నేటికీ కాపాడుకొంటున్నదీ
ఆ వంశానికి చెందిన వాళ్ళే.
ఆడవాళ్ళే అక్కడ పూజారులు
అక్కడ బ్రాహ్మణ పూజారులు లేరు
దాన్నొక త్యాగానికి జ్ఞాపకంగా కట్టిన ఆలయం
ఆమెను ఎంతోమంది ఒక గ్రామ దేవతగా ఆరాధిస్తున్నారు. ఆ వంశానికి నేను నమస్కరిస్తున్నాను.
బుక్కరాయసముద్రం (అనంతపురం) చూసి, అక్కడ ఉన్న ముసలమ్మ తల్లి దేవాలయం దర్శించి, కట్టమంచి రామలింగారెడ్డి గార్నీ, ఆయన రచించిన ముసలమ్మ మరణం కావ్యాన్ని గుర్తుచేసుకున్న సమయంలో తీసిన కొన్ని దృశ్యాలు.
నిన్న (11.11.2022) వతేదీన శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురంలో ఒక కాన్ఫిడెన్సియల్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన అనంతరం ఇలా నేను (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు), యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ తెలుగు శాఖ లో అధ్యక్షులుగా పనిచేస్తున్న ఆచార్య విస్తాలి శంకరరావుగారు కలిసిన దృశ్యాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి