యువసాహితీవేత్త అన్ని పత్రికల్లో మంచి వ్యాసాలు రాస్తున్న డా. బడిగే ఉమేశ్... నిన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహించిన 22వ స్నాతకోత్సవంలో తన డాక్టరేట్ పట్టాకు స్వర్ణపతకాన్ని అందుకున్నాడు. శ్రీమాన్ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారి జీవితం, రచనలపై నా పర్యవేక్షణలో తన పరిశోధనను పూర్తి చేశాడు. డియర్ ఉమేశ్...ఈ సందర్భంగా నీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు... ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్ జస్టీస్ నరసింహారెడ్డి చేతుల మీదుగా డా.బడిగే ఉమేశ్ డాక్టరేట్ పట్టాను, స్వర్ణపతకాన్ని స్వీకరిస్తున్న దృశ్యం, చిత్రంలో వైస్ ఛాన్సలర్ ఆచార్యబి.జె.రావు, గవర్నర్ డా. తమిళసై, కేంద్ర మంత్రి ప్రదాన్ ఉన్నారు.
గోల్డ్ మెడల్ అందుకున్న ఉమేశ్ ని అభినందిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
భూమిపుత్ర దినపుత్రక, 2.10.2022 సౌజన్యంతో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి