"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

07 అక్టోబర్, 2022

హెచ్ సియు తెలుగు శాఖ ఆధ్వర్యంలోపూర్ణ మాలావత్ కి ఘన సన్మానం (7.10.2022)

 హెచ్ సియు తెలుగు శాఖ ఆధ్వర్యంలో పూర్ణ మాలావత్ కి ఘన సన్మానం

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమనేది మానవుడు తలచుకొంటే దేనినైనా సాధించగలడనిచెప్పడానికి నిదర్శనమైన ఒక గొప్పకార్యంగా కుమారి మాలావత్ పూర్ణ  ఏడు శిఖరాలను అధిరోహించిన విజయమే నిదర్శనంగా నిలుస్తుందని హెచ్ సియు ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్ఎస్ సర్రాజుగారు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు  హెచ్ సియు, తెలుగు శాఖ ఏర్పాటు చేసిన ‌పూర్ణ మాలావత్ సత్కార సభలో ముఖ్య అతిథిగా పాల్గొని, ఆమెను సత్కరించి, సుధీర్ రెడ్డి పామిడి రెడ్డి రచించిన ఎవరెస్ట్ ఇన్ మైండ్ తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలను ఆవిష్కరించి ప్రొ.వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్. ఎస్. సర్రాజు మాట్లాడారు. ఈ సభకు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. పూర్ణ సాధించిన విజయాలు విద్యార్థులకు స్ఫూర్తినివ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. పూర్ణ మాలావత్ ఎవరెస్ట్, మౌంట్ కిలిమంజారో, మౌంట్ ఎల్ బ్రస్, మౌంట్ అకోన్ కండువా, మౌంట్ కాంటెన్జ్, మౌంట్ విన్ సెన్, మౌంట్ తెనాలి అనే ఏడు శిఖరాలను అధిరోహించిన అతి చిన్న వయసులోని యువతిగా ప్రపంచ రికార్డు సాధించిన సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఏదైనా ఒక రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లుగానే భావిస్తారని, పూర్ణ మాలావత్ సాధించిన విజయం దాన్నే సూచిస్తుందని కోచ్ పరమేశ్ సింగ్ వ్యాఖ్యానించారు. పర్వత శిఖరారోహణ సందర్భంగా ఆమె ఎదుర్కొన్న ఒడిదుడుకులను, చివరికి ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అనుభవాలను పరమేశ్ సింగ్ వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఇన్ చార్జి డీన్ ఆచార్య రవిరంజన్, మాట్లాడుతూ పూర్ణ మాలావత్ నుంచి అభినందించారు. ఆమె విజయాల్ని వర్ణిస్తూ రాసిన ఎవరెస్ట్ ఇన్ మైండ్ పుస్తక రచయితను ప్రశంసించారు.  పుస్తక రచయిత సుధీర్ రెడ్డి పామిడి రెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకం ఆమె విజయాల్ని చరిత్రీకరించడంతో పాటు, స్ఫూర్తిని నింపే రాయాలనుకున్నానని, హిందీ,తమిళ్, కన్నడ భాషల్లో కూడా అనువాదం జరుగుతున్నాయన్నారు. ఆంగ్ల పుస్తకాన్ని ఆచార్య పిల్లలమర్రి రాములు సమీక్షించారు. తాను పదమూడేళ్ళ వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాననీ, భారతదేశంలో అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన చరిత్ర సాధించానని, తాను అత్యంత పేదరికంలో నుంచీ, ఒక గిరిజన కుటుంబం నుండి వచ్చాననీ, అయితే సాధించాలనే తపన ఉంటే కులం, మతం, జెండర్, ప్రాంతం లాంటివేమీ ఆటంకం కాదని పూర్ణ మాలావత్ అన్నారు. తనపై సినిమాలు, పుస్తకాలు వచ్చాయనీ అవన్నీ అనేకమంది ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైందని పూర్ణ మాలావత్ తన స్పందనను తెలియజేశారు. తనకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉండగా ఈ పర్వతారోహణ చేయడానికి ఐపిఎస్ ఆఫీసర్ ఆర్‌.ఎస్.ప్రవీణ్ కుమార్ గారుచేసిన సహాయం మరిచిపోలేనిదని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావు ఆన్ లైన్ ద్వారా మాట్లాడుతూ గిరిజనులందరి తరపునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, ఆచార్య జి.అరుణకుమారి, ఆచార్య డి.విజయలక్ష్మి, డా.భూక్యా తిరుపతి,  డా.బాణాల భుజంగ రెడ్డి, డా.డి.విజయకుమారి, పరిశోధకులు, విద్యార్ధినీ విద్యార్ధులు అధికసంఖ్యలో పాల్గొన్నారు

కామెంట్‌లు లేవు: