తెలుగు ఆచార్యులకు పదవీవిరమణ సన్మానసభ
తెలుగు శాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య తుమ్మల రామకృష్ణ ఆచార్యజి.అరుణ కుమారి గార్లకు పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం నాడు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన (28.10.2022) సన్మాన సభ జరిగింది. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి.కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని, ఇరువురికీ ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆచార్య వి.కృష్ణ మాట్లాడుతూ భాషాసాహిత్యాలను బోధించే అధ్యాపకులకు, కవి, రచయితలకు సాంకేతికంగా పదవీవిరమణ జరిగినప్పటికీ వారి రచనా రంగంలో పదవీవిరమణ ఉండదని వ్యాఖ్యానించారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగు శాఖలో పనిచేసిన, వందలాది మంది విద్యార్థులకు పరిశోధక బాధ్యతలు వహించారని వక్తలు ప్రశంసించారు. ఆచార్య తుమ్మల రామకృష్ణ తెలుగు శాఖ లో పదవీవిరమణ చేస్తున్నప్పటికీ ద్రావిడ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా ఇంకా రెండున్నరేళ్లపాటు పనిచేస్తారన్నారు. ఆచార్య జి.అరుణకుమారి ఈ నెల ఆఖరికి పదవీవిరమణ చేసినా రచనా వ్యాసంగం కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, డా.బాణాల భుజంగరెడ్డి, ఆచార్య దాసర విజయకుమారి తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు. పదవీవిరమణ చేస్తున్న ఆచార్య తుమ్మల రామకృష్ణ, ఆచార్య జి.అరుణకుమారి తమకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రజ్యోతి దినపత్రిక 29.10.2022 సౌజన్యంతో
ఈ సమావేశం అనంతరం ఆచార్య జి.అరుణకుమారి పదవీవిరమణను పురస్కరించుకుని పూర్వవిద్యార్థులు, పరిశోధకులు ఒక జాతీయ సదస్సుని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య తుమ్మల రామకృష్ణ పాల్గొని శుభాకాంక్షలు అందజేశారు. పూర్వ విద్యార్ధులు ఆచార్య జి.అరుణకుమారి, శ్రీ చైతన్యకరణ్ రెడ్డి గార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య పరిమి రామ నరసింహం, ఆచార్య ఎన్.ఎస్.రాజుగారు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డా.కొండారవి, డా.రామకృష్ణ, ఆచార్య ఏటూరి జ్యోతి (కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు), ఆచార్య రాజేశ్వరమ్మ ( శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి), డా.జె.వి.రమణ (మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం), డా.వెంకటరామయ్య (ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ) డా.విజయ్ కుమార్, డా.సుబ్బారావు, డా.ప్రకాశరావు, డా.రమ్యజ్యోతి, డా.రాజీవ్ బాబు, డా. మాణిక్యరావు,, డా.హరిబాబు డా.పద్మ, రత్నాకర్, డా. బట్టు సుధాకర్, డా.వరప్రసాద్, డా. ఆదిత్య డా.ప్రిస్కిల్లా, డా.శంకర్, డా.అరుణ గంథం, తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి