నిన్న ( 5.9.2022) నాదీ (ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు), మా కుమారుడు దార్ల శ్రీనివాసరావుల పుట్టినరోజుని, చాలా మంది ఘనంగా నిర్వహించారు. తరగతి గదిలో ఏం.ఏ. తృతీయ సెమిస్టర్ విద్యార్థులు, నా దగ్గర పరిశోధన చేస్తున్న విద్యార్థులు, డి.ఎస్.యు విద్యార్థులు...ఇలా ఒక్కొక్కరు వంతుల వారీగా చేసినట్లు అనిపించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దళిత విద్యార్థి సంఘం (DSU) ఇంటికి వచ్చి ఎంతో ఘనంగా నిర్వహించారు. డి .ఎస్. యు తరపున వేణు, కమలాకర్, వెంకటాద్రి, కళ్యాణి, మానస, సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు
సెల్ఫీతో అందర్నీ అందమైన ఫోటోలో బంధించే ప్రయత్నం చేస్తున్న వేణు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి