దిశ తెలుగు దినపత్రిక, 4.9.2022 సౌజన్యంతో
నవ తెలంగాణ తెలుగు దినపత్రిక, 4.9.2022 సౌజన్యంతో
దేవగురు, స్వాతి పాఠశాలల ఆధ్వర్యంలో గురుపూజోత్సవం వేడుకలు
ఆదర్శవంతమైన సమాజం ఉపాధ్యాయుల వల్లనే సాధ్యమవుతుందని, అందరిలోనూ గౌరవనీయమైన స్థానం కూడా ఉపాధ్యాయులదేనిని హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. శనివారం మాదాపూర్ లోని స్వాతి ఉన్నత పాఠశాల ఆవరణలో దేవగురు కాన్సెప్ట్ స్కూల్, స్వాతి ఉన్నత పాఠశాలలు సంయుక్తంగా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ విద్యాబోధన అందించినవారికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలతో సత్కరించారు. ఈ సభకు స్వాతి ఉన్నత పాఠశాల, దేవగురు ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత వి.ఫణికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని, ఉపాధ్యాయులను దుశ్శాలువ, జ్ఞాపికలతో సత్కరించి మాట్లాడారు. అత్యంత పేదరికంలో పుట్టినప్పటికీ క్రమశిక్షణ, పట్టుదల, వినయం, పెద్దల పట్ల గౌరవ భావంతో మెలుగుతూ, ఇవరయ్యో యేటనే ప్రొఫెసర్ గా చేరారని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం విశేషాలను వివరించారు. కృషి, పట్టుదలకు పేదరికం అడ్డుకాలేదనీ, అందువల్లనే భారత రాష్ట్రపతిగా అత్యున్నత స్థానానికి చేరుకున్నారని, ఆయన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారని వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విలువను పాశ్చాత్యుల దార్శినికతతో మేళవించిన భారతీయ తాత్వికతను వివరించే అనేక రచనలను చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యా బోధనలో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న వారిని ప్రోత్సహించే విధంగా ఈ సత్కారాలను చేస్తున్నట్లు కరస్పాండెంట్ ఫణి కుమార్ వివరించారు. స్వాతి ఉన్నత పాఠశాల ఇన్ చార్జి శ్రీమతి పి.శ్రీదేవి, దేవగురు కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి పద్మజ, ఇన్చార్జి శ్రీమతి రజియా సుల్తానా, భారత వికాస పరిషత్ కోశాధికారి రాళ్ళపల్లి యోగానంద్, కార్యదర్శి సురేందర్ రెడ్డి, డైరెక్టర్ విష్ణు ప్రసాద్ తదితరులు ఈకార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సరిత, వసంత,అగస్టీనా, ఫరీద్ పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి