చిన్నతనంలో "హాస్య సంభాషణ"లతో "ఉత్తరాల"తో ప్రారంభించి
యవ్వనంలో "జీవితనావ"తో తన కావ్య నాయికను నడిపించి
"మాదిగ చైతన్యం"తో సాహితీపథంలో సమాజాన్ని ఉత్తేజపరుస్తూ
"సాహితీమూర్తుల ప్రశస్థి"తో సాహితీ లోకం ప్రశంసలు పొందుతూ
ఒక "దళిత తాత్వికుడు"గా మారి "సృజనాత్మక రచనలు చేయడం ఎలా" అంటూ సమాజాన్ని ఆలోచింపజేస్తూ
"సాహితీ సులోచన"తో సాహిత్య సమాలోచనలు జరుపుతూ
తన విమర్శలననే "వీచిక" లను "పునర్ మూల్యాంకనం" చేస్తూ
"బహుజన సాహిత్య దృక్పథం"తో "సాహితీమూర్తులు స్ఫూర్తి" లు బాటలో నడిచి స్ఫూర్తిని పొంది పురివిప్పిన "నెమలి కన్నుల" వలె తన "సాహితీ సౌగంధికల"ను నలు దిశలా వ్యాపింప చేస్తూ
సాహిత్యాన్ని ఒక పరిశోధన కలగా సూత్రాలను వల్లివేస్తూ
విద్యార్థి లోకానికి నూతన ఆవిష్కరణలుగా "పాఠ్య ప్రణాళికల"ను రూపొందిస్తూ "దార్ల మాట శతకం" లో ఒక శాసనముల తెలుగు సాహితీ లోకంలో అంచలంచెలుగా ఎదిగిన ఆచార్యులకు ఈ కళాశాల విరిసిన కుసుమాలతో నా
ఈ అక్షరమాల
-డా.ఎం.మాధవి, తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ మహిళా కళాశాల, ఖమ్మం
9.9.2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి