Kalonji Jayanthi/ 9.9.2022
*తెలంగాణ నిలువెత్తు ఉద్యమ సంకేతం కాళోజీ*
కాళోజీ నరనరాల్లోనూ ఉన్న చైతన్యమే తెలంగాణ ప్రజల హృదయాల్లో ఒక ఉద్యమ సంకేతంగా నిలిచిపోయిందని హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం (9.9.2022) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి అంతర్జాల ద్వారా ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా కళాశాల వారు ప్రిన్సిపాల్ డా.జి.పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన కాళోజీ నారాయణరావు జయంతి, తెలంగాణ భాషాదినోత్సవంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని 'కాళోజీ సాహిత్యం - ఉద్యమ చైతన్యం' అనే అంశంపై ప్రత్యేక ప్రసంగం చేశారు. కాళోజీ నారాయణరావుకి చిన్న నాటి నుండే అనేక ఉద్యమాలతో సంబంధాలు ఉండేనీ, అవన్నీ వాటన్నింటిలో తెలంగాణ భాష, సాంస్కృతిక ఔన్నత్యాన్ని కాపాడే విధంగా ఉద్యమించారని ఆయన సోదాహరణంగా వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, ఆ తర్వాత కూడా జరిగిన ఉద్యమాలతో కాళోజీకి అవినాభావ సంబంధం ఉందనీ, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయనది ఆత్మ గౌరవ పోరాటమనీ ఆచార్య దార్ల వ్యాఖ్యానించారు. కొన్ని లక
క్ష్యాలను సాధించడం కోసం పార్టీలకు అతీతంగా కూడా పనిచేయవలసి వస్తుందని కాళోజీ ఉద్యమ జీవితం కొన్ని కొత్త పాఠాల్ని నేర్పుతుందని ఆయన వివరించారు. తెలంగాణా ప్రాంతంలో ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని ఏకం చేసి, మీతో మౌఢ్యాన్ని నిర్మూలించడానికి, మానవహక్కుల సంఘాలతో కూడా కలిసి పని చేశారని కాళోజీ చేసిన ఉద్యమాలను వివరించారు. కాళోజీ జీవితమే ఒక ఉద్యమమని, ఆయప జయంతిని తెలంగాణా భాషాదినోత్సవంగా జరుపుంటున్నామనీ, దీనిలో భాగంగానే ఈ ప్రత్యేక ప్రసంగాన్ని ఏర్పాటు చేసినట్లు సభాధ్యక్షులు డా.పద్మావతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా డా.మాధవి వ్యవహరించగా తెలుగు శాఖ అధ్యక్షులు డా. ఎం.విద్యాప్రవీణ స్వాగతం , వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ప్రసంగం అనంతరం విద్యార్థినులు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి