మా నాన్నగార్ని మా వూర్లో "అబ్బాయి" అని పిలుస్తారు. అందువల్ల ఆ పేరుతోనే ప్రతి యేడాదీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు ఎం.ఏ. తెలుగులో, అదీ భారతీయ కావ్యశాస్త్రం, సాహిత్య విమర్శ సబ్జెక్టులలో అత్యధిక మార్కులు సాధించిన వారికి 'శ్రీదార్ల అబ్బాయి మెమోరియల్ మెడల్ ఇచ్చేలా ఏర్పాటు చేశాను. తల్లిదండ్రుల ఋణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. అయినా ఏదో చిన్న ఉడతాభక్తిని ప్రదర్శించు కోవడమే. ఈ మెడల్ అందుకోబోతున్న త్రిపురాంజనేయులు, ధన్యశ్రీ, నీరజ లకు నా ప్రత్యేక శుభాకాంక్షలు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖాధ్యక్షులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
19
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి