ఛాయ పబ్లికేషన్స్, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డా.మల్లెగోడ గంగాప్రసాద్ తొలి కవితా సంపుటి పదన పుస్తకావిష్కరణ సభ ది.16.09.2022 వతేదీ సా.6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ ,హైదరాబాద్ లో జరిగింది. ఈ సభకు
హైదరాబాద్ విశ్వవిద్యాలయం, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. గంగా ప్రసాద్ తన డాక్టరేట్ సిద్దాంత గ్రంథానికి స్వర్ణపతకం సాధించడంతోపాటు, అదే విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ గా పనిచేశారని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. ఒక పర్మినెంట్ ఫ్యాకల్టీ కంటే కూడా అంకితభావంతో గెస్ట్ ఫ్యాకల్టీ గా పనిచేశారనీ, విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తుండేవారన్నారు. జాతీయ సదస్సులు కూడా నిర్వహించి అవి పుస్తక రూపంలో కూడా తీసుకురావడం గంగాప్రసాద్ చేసిన ఒక గొప్ప పనిగా ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆం.ప్ర. ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషనల్ పూర్వ కమిషనర్ IAS(Rrd.), ప్రముఖ సాహితీవేత్త శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కొంతమంది యువకులు శ్రీశ్రీ గారు అన్నట్లు నవ జీవన నిర్మాతలు. అలాంటి కోవకు చెందిన వాడు డాక్టర్ గంగా ప్రసాద్ అని వాడ్రేవు వీరభద్రుడు వ్యాఖ్యానించారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా డా. నందిని సిధారెడ్డి ప్రధానోపన్యాసం చేశారు. పదం అంటే మెత్తన అనే అర్థం తో పాటు పదునైన అని అర్థం కూడా ఉందని అంత పదునైన కవిత్వం రాసిన వాడు గంగాప్రసాద్ అని అనేక కవితలను సోదాహరణంగా ఆయన వివరించారు.
గౌరవ అతిథులుగా ప్రముఖ సాహితీ విమర్శకులు
డా. అంబటి సురేంద్రరాజు, ఆత్మీయ అతిథులుగా ఛాయ రిసోర్స్ సెంటర్ అధినేత శ్రీ ఛాయ కృష్ణ మోహన్ బాబు,
శ్రీ ఆదిత్య కొర్రపాటి, శ్రీ తగుళ్ల గోపాల్, డా. కాసర్ల నరేశ్ రావుగార్ల పాల్గొని మాట్లాడారు. గంగా ప్రసాద్ కవిత్వాన్ని వివిధ పార్శ్వాల్లో వక్తలు వివరించారు.
ఈ పుస్తకాన్ని కవి మల్లెగోడ గంగా ప్రసాద్ తన గురువు డా. కాసర్ల నరేశ్ రావుగార్కి తొలి ప్రతినిచ్చారు.
సభలో మాట్లాడుతున్న
డా.మల్లెగోడ గంగా ప్రసాద్ గారి కవితా సంపుటి 'పదన' ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సభలో ప్రసిద్ధ సాహితీవేత్తలు శ్రీ వాడ్రేవు వీరభద్రుడు, డా.నందిని సిధారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు
డా.మల్లెగోడ గంగా ప్రసాద్ గారి కవితా సంపుటి 'పదన' ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సభలో ప్రసిద్ధ సాహితీవేత్తలు శ్రీ వాడ్రేవు వీరభద్రుడు, డా.నందిని సిధారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు
.డా.మల్లెగోడ గంగా ప్రసాద్ గారి కవితా సంపుటి 'పదన' ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించి మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సభలో ప్రసిద్ధ సాహితీవేత్తలు శ్రీ వాడ్రేవు వీరభద్రుడు, డా.నందిని సిధారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి