సాక్షి దినపత్రిక, 30.8.2022 సౌజన్యంతో
నమస్తే తెలంగాణ దినపత్రిక, 30.8.2022 సౌజన్యంతో
భూమి పుత్ర దినపత్రిక, 30.8.2022 సౌజన్యంతో
నమస్తే దినపత్రిక 30.8.2022 సౌజన్యంతోదిశ దినపత్రిక, 30.8.2022 సౌజన్యంతో
సామాజిక మాధ్యమాల్లో సత్వరం తమ భావాలను పరస్పరం వినియోగించుకోవడమే వాటి ప్రధాన ధ్యేయమని, ఈ సందర్భంగా అన్య భాషా పదజాలాన్ని కూడా విస్తృతంగా వాడతారని హెచ్. సి. యు. తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారు గిడుగు వేంకట రామమూర్తి 159 వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ అంతర్జాల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 'తెలుగు భాష ఆధునీకరణకు ప్రసార మాధ్యమాల పాత్ర' అంశంపై మాట్లాడారు. ఈ సమావేశానికి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య డి.మునిరత్నం నాయుడు అధ్యక్షత వహించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషలోని వివిధ కోణాలలో జరుగుతున్న అభివృద్ధిని సమీక్షించుకోవడానికి నిష్ణాతుల చేత ప్రసంగాలు ఇప్పించడం ఈ సదస్సు ముఖ్యలక్ష్యమని ఆయన చెప్పారు. సదస్సులో ముఖ్యఅతిథిగా భారతీయ భాషల సంస్థ, మైసూర్ డైరెక్టర్ శైలేంద్ర మోహన్, విశిష్ట అతిథిగా ప్రాచీన భాషల శాఖధిపతి, భారతీయ భాషల సంస్థ మైసూరుకి చెందిన ఆచార్య బి.వి.శివరామకృష్ణ, ఆచార్య పరిమి రామనరసింహం, ఆచార్య కోలవెన్ను మలయ వాసిని ( ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం), ఆచార్య కొలకలూరి మధు జ్యోతి (శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి), ఆచార్య తప్పెట రాంప్రసాద్ రెడ్డి ( యోగి వేమన విశ్వవిద్యాలయం , కడప), ఆచార్య జి. బాలసుబ్రహ్మణ్యం (శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం), ఆచార్య జె రాజేశ్వరమ్మ (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) వారు తెలుగు అభివృద్ధికి భాష అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై పత్రాలను సమర్పించారు. కార్యక్రమానికి డాక్టర్ కొల్లేటి రవిబాబు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమేష్,










కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి