మాట్లాడుతున్న తెలంగాణ ఎమ్మెల్సీ ప్రజాకవి గోరేటి వెంకన్న గారు
ఎమ్మెల్సీ, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, జూపాక సుభద్ర.
సభలో మాదిగ కొలుపు పుస్తకాన్ని సమీక్షించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని సత్కరిస్తున్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ , రచయిత ఆచార్య పులికొండ సుబ్బాచారి, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య వి కృష్ణ తదితరులు ఈ చిత్రంలో ఉన్నారు.
...
మాదిగల సాంస్కృతిక ఔన్నత్యాన్ని తెలిపే నవల 'మాదిగకొలుపు'
మాదిగ, దళిత ఉపకులాల సాంస్కృతిక ఔన్నత్యాన్ని, భారతీయ సమాజంలో వారి విలువను తెలియజేసిన నవల మాదిగ కొలుపు అని హెచ్సియు తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. పులికొండ సుబ్బాచారి రచించిన మాదిగ కొలుపు నవలను 21.7.2022 వ తేదీ అనగా గురువారం సాయంత్రం హెచ్ సియులోని లైఫ్ సైన్సెస్ సమావేశ మందిరంలో ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిగకొలుపు నవలపై ఆచార్యదార్ల వెంకటేశ్వరరావు సమీక్ష చేశారు.
సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ఆచార్య పులికొండ సుబ్బాచారి చేసిన పరిశోధనను ఒక నవలగా తీర్చిదిద్దారని, కుల, మత విషయాలన్నీ మనిషి ఆకలి కేకల ముందు నిలవవనీ, పుస్తకంలోని వేదనను మాత్రం అర్థం చేసుకోవాలన్నారు.నవలను చదివించే కథనంతో రాశారని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. దళితుల సాంస్కృతిక జీవనాన్ని దీనిలో ప్రతిఫలించారని పేర్కొన్నారు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ నేటికీ సమాజంలో ఉన్న అనేక కులసమస్యల్ని చిత్రించారని చెప్పారు. సమావేశానికి స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి.కృష్ణ అధ్యక్షత వహించారు. పుస్తకాన్ని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, ప్రముఖ కథారచయిత్రి జూపాక సుభద్ర అనేక కోణాలనుంచి మాట్లాడారు. సమావేశంలో హెచ్ సియు పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అప్పారావు పొదిలె, సిడాస్ట్ హెడ్ ఆచార్య విష్ణు సర్వదే, ప్రముఖ రచయితలు శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. చివరిలో రచయిత ఆచార్య పులికొండ సుబ్బాచారి మాట్లాడుతూ నవల నేపథ్యాన్ని వివరించి, అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థినీ, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి