
శ్రీమతిగంగినేనికళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం, వినుకొండ ,పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. "డా. సినారె సాహిత్య వైభవం "అనే జాతీయ అంతర్జాల సదస్సును14-7-2022న నిర్వహించారు. ప్రారంభ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కొల్లు శ్రీనివాసరావుగారు అధ్యక్షత వహించి సదస్సుల ఆవశ్యకతను పేర్కొన్నారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాలవిద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డా. రమాజ్యోత్స్న కుమారిగారు సినారె విశిష్టతను కొనియాడుతుా సదస్సుకు శుభాకాంక్షలు అందించారు.సదస్సును నిర్వహించిన తెలుగు విభాగాధిపతి డా.జి.స్వర్ణలత డా. సినారె సాహిత్య వ్యక్తిత్వాన్ని విహంగ వీక్షణం చేసి సినారె బహముఖీన ప్రతిభను స్మరించుకోవడం సదస్సు లక్ష్యంగా వివరించారు. వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, ప్రముఖ సాహితీవేత్తలు వక్తలుగా తమ విలువైన ప్రసంగాలతో సదస్సును ఫలవంతం చేశారు.
మొదటి వక్తగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య మధుజ్యోతి గారు సినారె చారిత్రక గేయ కావ్యాలను చారిత్రక భూమికను జోడిస్తూ విశ్లేషించారు. రెండవ వక్తగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుండి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు సినారె పరిశోధన పటిమ ను అనేక దృష్టాంతాలతో విశదపరిచారు. మూడవ వక్తగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య యన్. వి. కృష్ణారావుగారు సినారె వచన కవితా విశిష్ట తను సమగ్రంగా వివరించారు. నాల్గవ వక్తగావిశ్రాంతఆచార్యులు, విదుషీమణి వెలువోలు నాగరాజ్యలక్ష్మిగారు విశ్వంభర కావ్యాన్ని సాధికారికంగా విశ్లేషించారు.ఐదవ వక్తగావిద్వన్మణి డా. వుయ్యూరు లక్ష్మీనరసింహారావు గారు సినారె వైవిధ్యభరితమైన చలనచిత్ర సాహిత్యాన్ని
వీనులవిందుగా వినిపించారు. ఆరవవక్తగా సాహితీవేత్త, తెలుగు అధ్యాపకులు డా. కోయి కోటేశ్వరరావుగారు సినారె ప్రపంచపదులను
సవివరంగా �
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి