ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్కి
ఏడాదికేడుతోడై
తేడాలేకుండమీరుతెలుగుకువెలుగై
నీడనుపలువురికందియ
జాడలవివెదకుచువారుఛాత్రతనెరపున్
తమరి ఘనతను జాటగ తడుము కొనక
పదములవి వేగమై సాగి పద్యమందె
చోద్యమిదిగాదు నిజముగ చూచు వారు
గురువు నందలి భక్తికి గురుతు లివియె
అభినందనయాచార్యా!
సభలందునమీకుమీరుసాటిపలుకులన్
అభిమానముజూపుతమను
అభినవవాచస్పతియనియందరుపిలుతుర్
అభినందనలతో…
కవికోకిల డా.జె.వి.చలపతిరావు,
ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి