"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

25 జూన్, 2022

ఆచార్య దార్ల పై గోవిందుని గోవర్ధన్ పద్యం

 ప్రొ౹౹దార్ల వేంకటేశ్వరరావుగారితో నాకు యేర్పడిన సాహిత్య స్నేహబంధము

సీ౹౹

ఆప్యాయ తనురాగ మాదరమ్ముల తోడ

       సహృదయ మున్నట్టి సజ్జనుండ!


సాహిత్య సారమున్ సంగ్రహించుచు మన

      శిష్యుల హృదిలోకి చేరినావు


వివిధాంశ ములనెల్ల నవపోషనము బట్టి

       యెదుగుచు నెంతయో యొదిగినావు


సద్విమర్శలతోడ సభలలో చర్చించి

         మనసు నాకర్షించి మసలినావు


తే౹౹

పూర్వ జన్మలో జేసిన పూజవలన

స్నేహ బంధమేర్పడె నాకు చింతలేక

దార్లవంశాబ్ధిశేఖరా!దండమయ్య

మంజు వేంకటేశ్వర!మిమ్ము మరువ తరమె!

గోవిందు గోవర్ధన్, 15.6.2022

కామెంట్‌లు లేవు: