తరణం దినపత్రిక, 3.5.2022 సౌజన్యంతో
తరణం దినపత్రిక, 2.5.2022 సౌజన్యంతో
మన తెలంగాణ దినపత్రిక, 2.5.2022 సౌజన్యంతో
సాక్షి దినపత్రిక, 2.5.2022 సౌజన్యంతో
నవతెలంగాణ దినపత్రిక, 2.5.2022 సౌజన్యంతో
నమస్తే న్యూస్ దినపత్రిక, 2.5.2022 సౌజన్యంతో
తెలుగులోకం దినపత్రిక, 2.5.2022 సౌజన్యంతో
ప్రిన్సిపాల్ శ్రీమతి ఎం.ప్రవీణ గార్కి చెక్కు రూపంలో విరాళాన్ని అందిస్తున్న డా. ఎం.మంజుశ్రీ. చిత్రంలో డా.మహంతయ్య, డా.రాపోలు శ్రీనివాస్, శ్రీమతి సుమతి, డా.సంద్య. ఇన్నర్ లో దార్ల అబ్బాయి, డా.దేవదాసు గార్ల ఫోటోలు ఉన్నాయి
తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు దార్ల ఏభై వేల విరాళం
ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ డిగ్రీ స్థాయిలో తెలుగు ద్వితీయ భాషగా చదివే విద్యార్థులను ప్రోత్సహించే దిశగా తమ తండ్రి కీర్తిశేషులు దార్ల అబ్బాయి (లంకయ్య), తమ మామగారు కీర్తిశేషులు డాక్టర్ ఎం.దేవదాసుల జ్ఞాపకార్థం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు, తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకాడమిక్ కౌన్సిల్ సభ్యుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ఏభై వేల రూపాయల విరాళాన్ని, ఆ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఎమ్. ప్రవీణకు అందజేశారు. ఈ చెక్కును తన భార్య డా.మంజుశ్రీ చేతుల మీదుగా శనివారం అందజేశారు. గత రెండేళ్లుగా తారా కళాశాల అకాడమిక్ కౌన్సిల్ సభ్యుడుగా ఆ కళాశాల విద్యార్థుల ప్రతిభను గమనిస్తున్నానని
కీ.శే.దార్ల అబ్బాయి ( లంకయ్య), కీ.శే. డా.ఎం.దేవదాసు గార్లు
, గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆ కళాశాల ఎన్నో
కొత్త కోర్సులు కూడా ప్రవేశపెడుతుందనీ, ఒక ఆడపిల్ల
చదువుకుంటే ఆ ఇళ్ళంతా విజ్ఞానవంమవుతుందని,
అందువల్ల ఆడపిల్లల్ని ప్రోత్సహించే లక్ష్యంతో
ఏభై వేల రూపాయల విరాళాన్ని ఇస్తున్నానని, దీనిపై వచ్చే
వడ్డీతో ప్రతి ఏడాదీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచే
ఒక విద్యార్థినికి నగదు బహుమతి, ప్రశంసా పత్రం
ఇచ్చేలా విధంగా ఈ విరాళాన్ని ఇస్తున్నానని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
వివరించారు. ఇప్పటికే తన తండ్రి పేరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
రెండున్నర లక్షలు, తమ స్వగ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఏభై
వేల రూపాయల విరాళాల్ని ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తమ కళాశాలకు విరాళాన్ని
ఇచ్చినందుకు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సంగారెడ్డి) ప్రిన్సిపాల్ శ్రీమతి
ఎమ్.ప్రవీణ, ఆ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు
డా.మహంతయ్య, అధ్యాపకులు డా.రాపోలు శ్రీనివాస్,
సుమతీ, డా.ఎం.మంజుశ్రీ ,
డా.సంధ్య, రాజశేఖర్ , కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్
వెంకటేశం, కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు
తెలియజేశారు.తారా కళాశాల ప్రిన్సిపాల శ్రీమతి ఎం.ప్రవీణగార్కి ఏభై వేల రూపాయల చెక్కుని అందజేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారి సతీమణి డా.ఎం.మంజుశ్రీ. ఈ చిత్రంలో తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగుశాఖ అధ్యక్షుడు డా.మహంతయ్య, అధ్యాపకులు డా.రాపోలుడా.రాపోలు శ్రీనివాస్, సుమతీ, డా.ఎం.మంజుశ్రీ , డా.సంధ్య తదితరులు ఉన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి