"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

08 ఏప్రిల్, 2022

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్కి సత్కారం (8.4.2022)

 


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గార్ని సత్కరిస్తున్న  బి.యజ్ఞనారాయణ 

మెమెంటో

ఆచార్య రుక్మారాణి, ఆచార్య ఎం.నాగమణి, ఆచార్య కవి నారాయణ మూర్తి, ఆచార్య బి.యజ్ఞనారాయణ, ఆచార్య జె.ఎస్.ఆర్.ప్రసాద్, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య బి.నాగేశ్వరరావు



స్కూల్ ఆఫ్ కంప్యూటర్ & ఇన్ఫర్మేషన్ సైన్సెస్, స్టూడెంట్స్ వెల్ఫేర్ కార్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న 'భారత్ కా అమృత్ మహోత్సవ్'' (బామ్-2022) లో విశిష్ట అతిధిగా పాల్గొని మాట్లాడిన సందర్భంగా *ఆచార్య బి.యజ్ఞనారాయణ, ట్రిపుల్ ఐటీ, తిరుపతి గారి చేతుల మీదుగా ఈరోజు (8.4.2022) *ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు* ని సత్కరిస్తున్న దృశ్యం.









కృత్రిమ మేధస్సు అభివృద్ధిలో భారతీయుల కృషి ప్రశంసనీయం
మానవభావోద్రికాల్ని కంప్యూటర్ ద్వారా గుర్తించగలిగేలా పరిశోధనలు మరింత లోతుగా జరగాలని ట్రిపుల్ ఐటీ, తిరుపతి అడ్జెస్టెంట్ ప్రొఫెసర్ బయ్యా యజ్ఞనారాయణ పేర్కొన్నారు. గత రెండు రోజులుగా స్కూల్ ఆఫ్ కంప్యూటర్ & ఇన్ఫర్మేషన్ సైన్సెస్, స్టూడెంట్స్ వెల్ఫేర్ కార్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న 'భారత్ కా అమృత్ మహోత్సవ్'' (బామ్-2022) లో భాగంగా స్వాతంత్ర్యానంతర భారతదేశంలో కృత్రిమ మేధస్సు నిర్మాణంలో భారతీయ భాషల పాత్ర అనే అంశంపై అంతర్జాల జాతీయ వెబినార్ ముగింపు సభలో ఆచార్య బయ్యా యజ్ఞనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత రెండు రోజులుగా ఈ సదస్సులో వివిధ శాస్త్రాల్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రోసెసింగ్ జరుగుతున్న తీరుతెన్నులను విషయనిపుణులు పరిశోధన పత్రాల్లో వివరించారని నిర్వహకులు డా.ఎం.నాగమణి తెలిపారు. ఈ ముగింపు సమావేశంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.జె.రావు మాట్లాడుతూ మన భారతీయ శాస్త్రవేత్త పాణి, ఇతర సంస్కృత పండితులు చెప్పిన సూత్రాలు ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ ని అర్ధం చేసుకోవడాని ఎంతగానో సహకరిస్తాయని అన్నారు. ఇస్రో శాస్త్రవేత్త డా. రాఘవేంద్ర కూనె, మేరా ఈవెంట్స్ సిఇవో చెన్నప్పనాయుడు దారపునేని, హెచ్ ఏల్ నాసిక్ డిజియమ్ రాజేంద్రమూలె, సాప్ట్వేర్ లో విశేషకృషి చేసిన ఎలెన్ తిరుమారన్, డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య జి.నాగరాజు, చీఫ్ వార్డెన్ ఆచార్య డి.విజయలక్ష్మి, ఇస్రో బెంగళూరు సైంటిస్ట్ గా.మూర్తి రేమిళ్ళ,సౌత్ కొరియా ఊసాంగ్ విశ్వవిద్యాలయం ఆచార్య మధుసూదన్ సింగ్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్సు డీన్ ఆచార్య భగవతి, ఆచార్య కవి నారాయణ మూర్తి, తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సంస్కృత శాఖ అధ్యక్షుడు ఆచార్య జె.యస్.ప్రసాద్, అమెరికా నుండి డా.డింపుల్ కౌర్ లతో పాటు డా.బి.నాగేశ్వరరావు, డా.ఎన్.రుక్మారేఖ, విద్యార్థినీ, విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 


కామెంట్‌లు లేవు: