కొత్తగా నియమితులైన హైదరాబాద్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ గార్ని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎస్సీ ఎస్టీ ఫ్యాకల్టీ ఫోరం సభ్యులు మర్యాదపూర్వకంగా ఈ రోజు అనగా 9 ఫిబ్రవరి 2022వ తేదీన కలిసారు. ఈ సందర్భంగా ఆయనను అభినందించి, ఆయన కాలంలో యూనివర్సిటీ అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ ని కలిసిన వారిలో ఫోరమ్ కన్వీనర్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఫోరమ్ కోర్ కమిటీ సభ్యులు డా.నాగేశ్వరరావు, డా. కృష్ణయ్య, డా.రాణి రత్నప్రభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోరం ముద్రించిన కాలెండర్ ని రిజిస్ట్రార్ డాక్టర్ దేవేష్ నిగమ్ ఆవిష్కరించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి