ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సెంట్రల్ యూనివర్సిటీ లోనే ఎం.ఏ. ఎం.ఫిల్, పిహెచ్.డిలను చేసి, ప్రస్తుతం అదే శాఖలో శాఖాధ్యక్షుడుగా ఉన్నారు. డా.యస్.టి.జ్ఞానానందకవి గారి ఆమ్రపాలి కావ్యంపై ఎం.ఫిల్, ఆరుద్ర సాహిత్యంపై డాక్టరేట్ చేశారు. ఎం.ఏ.సోషియాలజీ, పలు పి.జి.డిప్లోమాలు చేశారు. తన పర్యవేక్షణలో 14 డాక్టరేట్, 21 ఎం.ఫిల్ డిగ్రీలు పొందారు. దళిత సాహిత్యం, డయాస్పోరా సాహిత్యం, సృజనాత్మక సాహిత్యం-మౌలిక భావనలు, ఎం.ఏ.స్థాయిలోనే పరిశోధన గ్రంథ రచన - పద్ధతులు మొదలైన నూతన పాఠ్యాంశాలను రూపకల్నన చేశారు. ఒక యుజిసి మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేశారు. నాలుగు జాతీయ సదస్సులు నిర్వహించారు. 100కి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వెబినార్లలో పాల్గొన్నారు. సుమారు 22 పుస్తకాలు ప్రచురించారు. ఒక కవితా సంపుటి, ఒక పద్యశతకం ప్రచురించారు. ఇటీవలే నెమలికన్నులు పేరుతో తన ఆత్మకథ తొలిభాగం వచ్చింది . వీరి రచనలు వివిధ విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. వివిధ విశ్వవిద్యాలయాలకు పాఠ్యాంశాలు రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం సంపాదకుడుగా ఉన్నారు. బోధన, పరిశోధనలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వారు లక్షరూపాయలతో పాటు ఇచ్చే ఛాన్సలర్ అవార్డుని అందుకున్నారు. వీటితోపాటు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, దళిత సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ వారూ, దళిత ఓపెన్ యూనివర్సిటీ, ఆం.ప్ర. వారిచ్చే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పురస్కారాలతో పాటు అనేక సాంస్కృతిక సంస్థల వారి పురస్కారాలు పొందారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక విశ్వవిద్యాలయాల్లో బోర్డు ఆఫ్ స్టడీస్
సభ్యునిగా ఉన్నారు. కోర్సు మెటీరియల్ రచయితగా ఉన్నారు.స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ గా, సుకూన్ కమిటీ చైర్మన్ గా,ప్రోక్టోరియల్ బోర్డులో ప్రోక్టర్ గా పనిచేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి