ప్రసిద్ధ కవి, విమర్శకుడు డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు గారి సాహిత్యంపై ప్రెసిడెన్సీ కళాశాల, చెన్నై (యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్,అనుబంధం) లో డాక్టర్ ఎన్. ఎలిజిబెత్ విజయ కుమారి గారి పర్యవేక్షణలో టేకుమళ్ళ వెంకటప్పయ్య గారు పీహెచ్డీ పరిశోధన చేశారు. ఆ గ్రంథాన్ని 'డా.అద్దపల్లి రామమోహనరావు కవితా ప్రస్థానం-అధ్యయనం' పేరుతో ప్రచురించారు. దీనికి నన్ను ఒక ముందుమాట రాయమని అడిగారు. ఆ గ్రంథాన్ని చదివిన తర్వాత, డా. అద్దేపల్లి సాహిత్యంపై శాస్త్రీయమైన పరిశోధన' పేరుతో ముందు మాట రాశాను. ఆ పుస్తకాన్ని ఈ రోజే నాకు పోస్ట్ లో పంపించారు. డాక్టర్ టేకుమళ్ళ వెంకట వెంకటప్పయ్య గారూ... మీకు ఈ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.....ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షుడు సిటీ యూనివర్సిటీ హైదరాబాద్, హైదరాబాద్. 27.1.2022.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి