ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు తమ సాహిత్య, సాంస్కృతిక అంశాల ద్వారా విశ్వమానవ సౌభ్రాతృత్వం కోసం కృషి చేస్తున్నారని హెచ్.సి.యు తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు అన్నారు.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి వారు నిర్వహిస్తున్న మూడు రోజుల (18-21, నవంబర్ 2021) అంతర్జాతీయ, అంతర్జాలం సదస్సు తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాలు: ప్రవాసాంధ్రులు లో 19 .11.2021 వతేదీ శుక్రవారంనాడు పాల్గొని సదస్సులో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. డయాస్పోరా కథాసాహిత్యం- అస్తిత్వ చిత్రణ పేరుతో ఒక పరిశోధన పత్రాన్ని కూడా ఈ సమావేశంలో సమర్పించారు. ఒకప్పుడు కులం, ప్రాంతం, మతం వంటి అంశాలు ప్రాధాన్యత వహిస్తే నేడు వాటి స్థానంలో మానవత్వం అనేది మాత్రమే ప్రధానమైనటువంటి అంశంగా భావించి విశ్వమానవతా భావనలకు డయస్పోరా సాహిత్యం దోహదపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 మంది పాల్గొన్న ఈ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు లో అమెరికా మలేషియా స్విట్జర్లాండ్ సింగపూర్ తదితర దేశాల నుండి ప్రతినిధులు పాల్గొని ఆయా రంగాలలో తెలుగు వాళ్ళు చేస్తున్న కృషిని ఈ సమావేశంలో సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఈసదస్సులో సదస్సు నిర్వహణ కులు ఆచార్య కొలకలూరి మధు జ్యోతి మలేషియా నుండి సుధీర్ రెడ్డి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఆచార్య విశ్వనాధ్, తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి ఆచార్య మేడిపల్లి రవికుమార్, డా.బూసి వెంకటస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Live: https://www.youtube.com/watch?v=GhaQkZCyJwE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి