"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

04 అక్టోబర్, 2021

నవీన.... మరోసారి మాట్లాడగలవా!


 






నవీన....మరోసారి మాట్లాడగలవా!

అమ్మా...నవీన!
నువ్వు మళ్ళీ మరోసారి
తల్లి త్యాగాన్ని ఆకాశంలో రెపరెలాడించావేమో
నీ తల్లి కొంగుమాత్రం
ఆ కన్నీళ్ళ కారుస్తోంది

నువ్వు మళ్ళీ మరోసారి
నీతనూజుడికోసం
నీతనువునే తృణప్రాయంగా వదలిలేశావేమో
నీ తల్లి తనువు మాత్రం తల్లడిల్లిపోతోంది

నువ్వు మళ్ళీ మరోసారి
తల్లులపాలపుంతలో
ఓ నక్షత్రమై మురిసిపోతున్నావేమో
నీ బుజ్జి తండ్రి మాత్రం
నీ పాలకోసం గుక్కత్రప్పుకోకుండా
ఆకాశానికేసే చేతులు చాస్తున్నాడు

నువ్వు మళ్ళీ మరోసారి
ఆరిందాలాగో, అమాయకంగానో
మాట్లాడుతుంటే వినాలనుందమ్మా
కొండలేవో వేలాడుతున్నట్లున్నా
ఆకలికి తట్టుకోలేకనో ఆనందం పట్టలేకనో
నీచిన్ని బొజ్జలో పెద్దకల్లోలం రేపుతున్న నీబుజ్జిబాబుని
ముద్దాడ్డం కోసం ఎన్నియుద్ధాలైనా చేస్తానన్నావు
వాట్సాప్ నిండా కొత్తకొత్త వస్తువులు
ఆన్లైన్ బిజినెస్ అంటూ
నూరురైళ్ళనేవో వరుసగా నిలబెట్టినట్లు స్టాట్స్ లో
నిలబెట్టి కొనే వాళ్ళ కోసం నిరీక్షించే దానివి
ఆ మెరిపించే చీరలేవి?
ఆ మెరిసిపోయే గిల్టీ నగలేవి?
ఆ స్వచ్ఛమైన నువ్వుల పువ్వులేవి?

అమ్మా...నవీన
నువ్వు మళ్ళీ మరోసారి మాట్లాడితే వినాలనుందమ్మా!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగు శాఖాధ్యక్షుడు, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్

(నవీన చిన్న వయసులోనే వివాహం చేసుకుని, ప్రసవ సమయంలో సరైన చికిత్స అందక, సరైన పోషకాహారం అందకపోవడంతో చనిపోయారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, తెలుగు శాఖలో పరిశోధక విద్యార్థిని)





కామెంట్‌లు లేవు: