"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

06 October, 2021

ఉపాధ్యాయులపైనే ఆ దేశసాంస్కృతిక విలువల నిర్ణయం(5.10.2021 World Teachers Day)

 ఉపాధ్యాయులపైనే ఆ దేశసాంస్కృతిక విలువల నిర్ణయం


- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్య

ఒక దేశంలో పనిచేసే ఉపాధ్యాయులకిచ్చే గౌరవ, మర్యాదలను బట్టే ఆ దేశ సాంస్కృతిక ఔన్నత్యాన్ని నిర్ణయించవచ్చునని హెచ్ సి యూ తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతి ఉన్నత పాఠశాల, మాదాపూర్ లో మంగళవారం జరిగిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన సభలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజ స్వరూపాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడంలోను, వైజ్ఞానికంగా మార్చడంలోను, భవిష్యత్తు తరాలకు కావలసినవేమిటో దార్శనికంగా ఆలోచించి, కార్యరూపంలో పెట్టగలిగే గొప్ప ప్రభావాన్ని కలిగించగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉందని ఆచార్య దార్ల పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల అంకితభావాన్ని గుర్తుచేసుకోవడానికి 1994 నుండీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని యునెస్కో ప్రకటించిందని వెంకటేశ్వరరావు వివరించారు. 



సమావేశానికి అధ్యక్షత వహించిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల వల్లనే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా మలచబడతారనీ, తమ జీవిత కాలంలో అత్యధిక సమయం ఉపాధ్యాయుల తోనే గడుపుతారని, అందువల్లే దాన్ని పవిత్రమైన వృత్తిగా భావిస్తున్నారన్నారు. తమ సంస్థ ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరిస్తుందన్నారు. ఈ సందర్భంగా  ఇగ్నో డిప్యూటీ డైరెక్టర్ గా  పనిచేస్తున్న డా.కె.రమేశ్,   శ్రీరామ్ ఇంటర్నేషనల్ స్కూల్ తెలుగు పండితురాలు శ్రీమతి కె. షర్మిల లకు 'ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల్ని ప్రదానం చేశారు. విద్యార్థులు పాదపూజతో ఉపాధ్యాయులను గౌరవించు కున్నారు ఈ కార్యక్రమంలో  ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి. పణికుమార్, డాక్టర్ బి.ఆర.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పూర్వ డిప్యూటీ రిజిస్ట్రార్ కోటేశ్వరరావు, మాదాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బసవలింగం , ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, రామ్మోహన్, పాలెం శ్రీను, జనార్ధన్,విష్ణుప్రసాద్, భమిడిపాటి, శివరామకృష్ణ , కందుకూరి విజయానంద్, శ్రీమతి శ్రీదేవి బాలాజీ, విద్యార్థి నీ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకిచ్చే గౌరవంలోనే‌ దేశ‌ సంస్కృతి దాగి ఉంటుంది: హెచ్ సీ యూ తెలుగుశాఖాధిపతి ఆచార్య వెంకటేశ్వర రావు

నమస్తే శేరిలింగంపల్లి: ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం, మర్యాదలు ఆధారంగానే ఆ దేశ సంస్కృతి ఔన్నత్యాన్ని నిర్ణయించవచ్చని హెచ్ సి యూ తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ లోని స్వాతి ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ సమాజ స్వరూపాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దడంలోనూ, వైజ్ఞానికంగా మార్చడంలోనూ ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల అంకితభావాన్ని గుర్తు చేసుకునేందుకు 1994 నుండి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని యునెస్కో ప్రకటించిందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల వల్లనే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా మలచబడతారనీ అన్నారు. ఇగ్నో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న డా.కె.రమేశ్, శ్రీరామ్ ఇంటర్నేషనల్ స్కూల్ తెలుగు పండితురాలు కె. షర్మిల కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల్ని ప్రధానం చేశారు. విద్యార్థులు పాదపూజతో ఉపాధ్యాయులను గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి. పణికుమార్, డాక్టర్ బి.ఆర.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పూర్వ డిప్యూటీ రిజిస్ట్రార్ కోటేశ్వరరావు, మాదాపూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బసవలింగం , ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, రామ్మోహన్, పాలెం శ్రీను, జనార్ధన్, విష్ణుప్రసాద్, భమిడిపాటి, శివరామకృష్ణ , కందుకూరి విజయానంద్, శ్రీదేవి, బాలాజీ, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తున్న ఆచార్య వెంకటేశ్వర రావు































No comments: