పేదలకు, నిర్భాగ్యులకు నిష్కల్మషంగా సేవచేయడమే దైవసేవగా నమ్మిన మహోన్నతమైన వ్యక్తి మదర్ థెరీసా అని హెచ్ సి యూ తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం మాదాపూర్ లోని స్వాతి హై స్కూల్ ఆవరణలో మదర్ థెరీసా జన్మదిన వేడుకల్లో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మదర్ థెరీసా అనే పేరు తనని చేరదీసిన ప్రచారక్ సంస్థపేరు అనీ, తర్వాత కాలంలో ప్రపంచంలో అన్ని జీవులు పవిత్రంగా భావించే (మదర్) అమ్మగానే ప్రసిద్ధి పొందారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించారు. మానవ సేవే మాధవ సేవగా నమ్మిన సేవకులంతాకర్మయోగి కి నిదర్శనమే స్వచ్ఛంద సేవకులని అని ఆయన అన్నారు. మదర్ థెరీసా ను ఈ సేవకులంతా ఆదర్శంగా తీసుకోవాలని, సేవాగుణాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండే నేర్పాలని రామస్వామి అన్నారు. మానవుడికి నిజమైన ఆత్మసంతృప్తి నిష్కల్మషమైన సేవలోనే ఉంటుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేషమైన సేవలందిస్తున్న వి.విజయ్ కుమార్ బాబు, పి.వి.సుబ్బారావు, చావా అరుణ, శ్రీనివాస్ రాథోడ్ లకు మదర్ థెరీసా సేవారత్న పురస్కారాలు ప్రదానం చేస్తూ దుశ్శాలువ, కిరీటం, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాగం మల్లికార్జున యాదవ్, స్వాతి ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ పణికుమార్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డా.రామన్న, విష్ణు ప్రసాద్, పాలెం శ్రీను, జనార్ధన్, బాలన్న, పోలా కోటేశ్వరరావు గుప్త తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





















కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి